Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లీషు పిచ్‌లపై ఆ ఇద్దరినీ వ్యక్తిగతంగా మిస్ అవుతున్నా: అఫ్రిది

 Afridi feels Amir and Wahab should have been included in Pakistans World Cup squad

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన జట్టులో సీనియర్ ఆటగాళ్లు వాహబ్‌ రియాజ్‌, మహమ్మద్‌ ఆమీర్‌ పాకిస్థాన్ సెలక్టర్లు మొండిచేయి చూపించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఫామ్‌లేక ఇబ్బంది పడుతోన్న వీరిద్దరికీ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు షాకిచ్చింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వీరిద్దరికి చోటు దక్కకపోవడంపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిది అఫ్రిది స్పందించాడు. అఫ్రిది తన ట్విట్టర్‌లో "వరల్డ్‌కప్‌కు 15 మందితో కూడిన జట్టుని ఎంపిక చేయడం సెలక్షన్ కమిటీకి గట్టి సవాలే. జట్టులో చోటు దక్కించుకున్న అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. కప్‌ని ఇంటికి తెస్తారని ఆశిస్తున్నా. ఇంగ్లీషు పిచల్‌పై రాణించే అమీర్, రియాజ్‌ను వ్యక్తిగతంగా మిస్సవుతున్నా" అని ట్వీట్ చేశాడు.

వాహబ్‌ రియాజ్‌ 2017 నుంచి ఇప్పటి వరకూ పాక్ తరుపున ఒక్క వన్డే కూడా ఆడలేదు. చివరిగా భారత్‌తో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడాడు. అయితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన పాకిస్థాన్‌ క్రికెట్‌ లీగ్‌లో మాత్రం
వాహబ్‌ 13 మ్యాచుల్లో 17 వికెట్లు తీసి మూడో స్థానంలో ఉన్నాడు. మరోవైపు మహ్మద్ ఆమీర్‌ కూడా 2017 నుంచి ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు.

Story first published: Saturday, April 20, 2019, 15:19 [IST]
Other articles published on Apr 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+