Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20ల్లో 300 వికెట్లు తీసిన తొలి పాకిస్థాన్ క్రికెటర్

Afridi becomes first Pakistani to take 300 T20 wickets

హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ అరుదైన ఘనత అందుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో భాగంగా శుక్రవారం జరిగిన కరాచీ కింగ్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ మ్యాచ్‌లో అతను ఈ రికార్డును నమోదు చేసుకున్నాడు. టీ20ల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి పాకిస్థాన్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

మొత్తంగా పొట్టి క్రికెట్లో 300 వికెట్ల మైలురాయిని అధిగమించిన నాలుగో క్రికెటర్ కావడం విశేషం. వెస్టిండీస్ ఆటగాడు డీజే బ్రావో, శ్రీలంక స్పీడ్‌స్టర్ లసిత్ మలింగ, వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ 300 వికెట్లు తీసిన ఆటగాళ్ల క్లబ్‌లో ఉన్నారు.

వెస్టిండీస్ ఆల్ రౌండర్ డేన్ బ్రావో ఈ వరుసలో అందరికంటే టాప్‌గా ఉన్నాడు. అతను 2016లో జరిగిన విన్నింగ్ మ్యాచ్‌లో నాలుగు వికెట్లను తీసి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. అఫ్రిదీ తరువాత మరో పాకిస్థానీ ఆటగాడు సొహైల్ తన్వీర్ 289 వికెట్లతో రికార్డుకు చేరువలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధికంగా 97 వికెట్లు తీసిన క్రికెటర్‌గా అఫ్రిదీ ముందంజలో ఉన్నాడు.

Story first published: Sunday, March 18, 2018, 12:05 [IST]
Other articles published on Mar 18, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+