గౌతమ్ గంభీర్ కు ఆఫ్రిదీ క్షమాపణ
హైదరాబాద్: భారత బ్యాట్స్ మన్ గౌతం గంభీర్ కు పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదీ క్షమాపణలు చెప్పారు. కాన్పూర్ లో ఆదివారం జరిగిన మూడో వన్డే సందర్భంగా గంభీర్ తో వాగ్వివాదం జరగడానికి తన తప్పే కారణమని ఆయన అంగీకరించారు. తనదే తప్పని తెలుసుకున్నానని ఆయన అన్నారు. తాను విచారం వ్యక్తం చేశాను కాబట్టి వివాదం ముగిసినట్లేనని, ఇరు జట్ల సంబంధాలు మెరుగ్గానే ఉంటాయని ఆయన అన్నారు. ఆఫ్రిదీ ఇంటర్వ్యూను మంగళవారం పాకిస్తాన్ దినపత్రిక జంగ్ ప్రచురించింది.పిచ్ మధ్యలో ఢీకొన్న గంభీర్, ఆఫ్రిదీ ఆ తర్వాత వాగ్వివాదానికి దిగారు. ఆగ్రహం, నిస్పృహలే తన తీవ్ర ప్రతిస్పందనకు కారణమని ఆయన అన్నారు. బ్యాట్స్ మెన్ ఆధిపత్యం సాధిస్తున్నారని, తాము సరిగా ఆడలేకపోతున్నామని, గంభీర్ అడ్డు రావడంతో తనకు తీవ్రమైన కోపం వచ్చిందని, అందుకు ఇప్పుడు విచారం వ్యక్తం చేశానని ఆయన వివరించారు. తాను బాగా ఆడాలని అనుకుంటున్నానని, తన బౌలింగ్ బాగుండడం లేదని ఆయన అన్నారు.
Story first published: Tuesday, November 13, 2007, 23:53 [IST]
Other articles published on Nov 13, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications