కోల్‌కతా: భారత్‌తో మ్యాచ్ ఓటమి అనంతరం తనపై వస్తున్న విమర్శల పైన పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సోమవారం నాడు స్పందించాడు. తన పైన అభిమానులు ఆగ్రహజ్వాలలను తాము సానుకూలంగా తీసుకుంటామని చెప్పాడు.
ప్రయత్నలోపం లేకుండా 100 శాతం మైదానంలో కష్టపడితే అదే నాకు సంతప్తి అన్నాడు. కానీ గెలిచామా లేక ఓడామా అన్నది తాను పెద్దగా పట్టించుకోనని చెప్పాడు. మైదానంలో తప్పిదాలను తగ్గించడం పైన దృష్టి పెట్టామన్నాడు.
బౌలర్లు, బ్యాట్సుమెన్‌లు మంచి ఫాంలో ఉన్నారని చెప్పాడు. పొరపాట్లను తగ్గించడంపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పాడు. రేపు (మంగళవారం) పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ ఉంది. ఈ సందర్భంగా అఫ్రిది మాట్లాడాడు.

భారత్‌తో మ్యాచ్ సందర్భంగా కొన్ని తప్పిదాలు జరిగాయని, వాటిని న్యూజిలాండుతో జరిగే మ్యాచ్‌లో పునరావృతం కానివ్వమని చెప్పాడు. కోల్‌కతాలో పిచ్ పరిస్థితిని అంచనా వేయడంలో పొరపాటు జరిగిందన్నాడు. అయినా భారత్‌తో మ్యాచ్ అయిపోయిందని, దాని గురించి ఆలోచించడం లేదన్నాడు.
రానున్న మ్యాచులో తప్పిదాలు జరగకుండా చూసుకుంటామని చెప్పాడు. క్రికెట్ చాలా క్రూయల్ గేమ్ అన్నాడు. చాలామంది మాజీ ఆటగాళ్లు ఏడుస్తూ నిష్క్రమించారని చెప్పాడు. మొహాలీ పిచ్ తమకు అనుకూలిస్తుందన్న న్యూజిలాండ్ కోచ్ వ్యాఖ్యలను కొట్టి పారేశాడు.