కోహ్లి.. కానరాని భయమయ్యాడు: అఫ్గానిస్థాన్ బౌలర్ నవీనుల్ హక్ (Video)
ఐపీఎల్ 2023లో ఫైనల్ పోరు కంటే లీగ్ దశలో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. వాస్తవానికి ఆ మ్యాచ్ కంటే మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన వాగ్వాదం ఫ్యాన్స్‌కు జ్ణాపకంగా మారింది. ప్రస్తుతం టీమిండియా కోచ్, అప్పటి లక్నో మెంటార్ గౌతమ్ గంభీర్- ఆర్సీబీ బ్యాటర్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మధ్ జరిగిన గొడవ సినిమాలో క్లైమాక్స్‌ను తలపించింది.
అయితే ఆ గొడవకు వేదిక లక్నో అయినప్పటికీ అగ్గి రాసుకుంది మాత్రం బెంగళూరులో. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో లక్నో ఆఖరి బంతికి గెలిచింది. విజయానంతం అవేశ్ ఖాన్ చేసిన హంగామా అంతాఇంతా కాదు. బైస్ రూపంలో పరుగు తీసి జట్టును గెలిపించిన అవేశ్ ఖాన్.. తన పేరులోని ఆవేశాన్నిఆర్సీబీ అభిమానులకు చూపించాడు. హెల్మెట్‌ను నేలకు విసిరి కొట్టి గెలుపు సంబరాలు చేసుకున్నాడు.

మరోవైపు మెంటార్ గంభీర్ కూడా ప్లేయర్‌లా మైదానంలో గెంతులేస్తూ సెలబ్రేషన్స్ చేశాడు. అంతేగాక ఆర్సీబీ అభిమానులను సైలెంట్‌గా ఉండమని, వేలు చూపిస్తూ సింబాలిక్‌గా చెప్పాడు. కొన్ని రోజుల తర్వాత ఇరు జట్ల మధ్య లక్నోలో మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది. అయితే లక్నో ఓటమి ఛేదన ఆరంభంలోనే ఖరారైంది. కాగా, ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన నవీనుల్ హక్ .. ఆర్సీబీ ప్లేయర్లు స్లెడ్జింగ్ చేశారని గొడవకు దిగాడు. అంపైర్లు, నాన్‌స్ట్రైకర్స్ ఎండ్‌లో ఉన్న అమిత్ మిశ్రా నచ్చజెప్పడంలో ఆ వాగ్వాదం అక్కడితో ముగిసింది.
అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం అసలు రచ్చ మొదలైంది. కోహ్లి కరచాలనం ఇస్తుండగా నవీనుల్ హక్ దురుసుగా ప్రవర్తించాడు. ఆ తర్వాత గొడవలో గంభీర్ ఎంట్రీ ఇచ్చాడు. గంభీర్-కోహ్లి మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరింది. ఈలోపు ఇరు జట్ల ఆటగాళ్లు ఇద్దరిని కంట్రోల్ చేశారు. ఆ తర్వాత నవీనుల్ హక్‌ను కోహ్లి అభిమానులు సోషల్ మీడియా, మైదానంలో టార్గెట్ చేశారు. మరోవైపు నవీనుల్ హక్ కూడా ఇతర మ్యాచ్‌ల్లో కోహ్లి ఔటైన సందర్భాల్లో సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటూ పోస్టులు పెట్టాడు.
కోహ్లి తక్కువ స్కోరుకు ఔటైన ఓ సందర్భంలో నవీనుల్ హక్ మామిడి కాయలు తింటూ వ్యంగ్యంగా ట్రోల్ చేశాడు. ఆ తర్వాత కోహ్లి అభిమానులు నవీనుల్‌ను వదిలిపెట్టలేదు. దారుణంగా, విపరీతంగా నవీనుల్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శించారు. ఆ తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఈ అఫ్గానిస్థాన్ బౌలర్‌కు కోహ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి..నవీనుల్‌ను టార్గెట్ చేయడం ఆపేయాలని తన అభిమానులను కోరడంతో వివాదం సద్దుమణిగింది.
అయితే నవీనుల్ హక్ తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో కోహ్లి గురించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. కోహ్లి.. కానరాని భయమయ్యాడని ఒప్పుకున్నాడు. 'మామిడి కాయలు ఎప్పటికి తినను! లేదా అయిదు వికెట్లు ఎప్పటికీ తీయను!' ..దీనిలో ఏది ఎంచుకుంటావని అడగ్గా.. నవీనుల్ మామిడికాయలు తిననని సమాధానమిచ్చాడు. 'విరాట్ కోహ్లికి బౌలింగ్ చేయడం లేదా విరాట్ కోహ్లితో బ్యాటింగ్ చేయడం' అని అడగ్గా దానికి.. కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేస్తా అని బదులిచ్చాడు.
Amit Mishra said - "Virat Kohli was unnecessarily abusing LSG players, Kyle mayers and Naveen Ul Haq badly, he could have avoided the fight but he didn't"#ViratKohli pic.twitter.com/KwDU472TWE
— Richard Kettleborough (@RichKettle07) July 16, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications