అఫ్టాన్‌ను అందుకోలేక.. చాప చుట్టేసిన శ్రీలంక

దుబాయ్: ఆసియా కప్ ట్రోఫీలో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన శ్రీలంక జట్టుకు దారుణ పరాభవం ఎదురైంది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో కంగుతిన్న లంకేయులు ఈసారి పసికూన అఫ్ఘానిస్థాన్ చేతిలో 91 రన్స్ తేడాతో చావుదెబ్బ తిన్నారు. దీంతో వరుసగా రెండు పరాజయాలతో ఈ జట్టు ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది. శ్రీలంకపై అఫ్ఘాన్‌కు ఇదే తొలి విజయం. అటు అఫ్ఘాన్‌తో పాటు బంగ్లాదేశ్ సూపర్ ఫోర్‌కు అర్హత సాధించాయి.
సోమవారం ఆసియా కప్‌లో భాగంగా మూడో మ్యాచ్ జరిగింది. లంక..అఫ్ఘాన్‌లకు మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో 250 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన లంక 41.2 ఓవర్లలో 158 పరుగులకు కుప్పకూలింది. తరంగ (36) టాప్ స్కోరర్. స్పిన్నర్లు ముజీబ్, రషీద్, నబీలతో పాటు పేసర్ గుల్‌బదిన్‌కు రెండేసి వికెట్లు లభించాయి. అంతకుముందు టాప్ ఆర్డర్ అద్భుతంగా ఆడడంతో అఫ్ఘాన్ 50 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది.

వరుస వికెట్లు కోల్పోయి అవమానకరంగా:
లంక తడబాటు: స్లో పిచ్‌పై భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ ఎప్పటిలాగే తడబడింది. తొలి ఓవర్ నుంచే అఫ్ఘాన్ బౌలర్లు వికెట్ల వేట సాగించారు. అయితే ఉపుల్ తరంగ (36), ధనంజయ డిసిల్వా (23) కాస్త నిలదొక్కుకోవడంతో రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించగలిగారు. ఆ తర్వాత తిసార పెరీర (28), మాథ్యూస్ (22) మినహా ఏ బ్యాట్స్‌మెన్ కూడా ప్రత్యర్థి స్పిన్నర్లను ఎదుర్కోలేకపోయారు. దీంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి అవమానకరంగా ఓడింది.

అఫ్గాన్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ..
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న అఫ్ఘాన్ జట్టులో టాప్ ఆర్డర్ మెరుగైన ఆటతీరుతో ఆకట్టుకుంది. మధ్య ఓవర్లలో లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నా చివరి 10 ఓవర్లలో మాత్రం ఏడు వికెట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఓపెనర్లు షెహజాద్ (34), ఇహ్‌సానుల్లా జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఇలా తొలి 11 ఓవర్లలో జట్టు 50 పరుగులు చేసింది. 12వ ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన షెహజాద్‌ను అదే ఓవర్‌లో దనంజయ ఎల్బీగా అవుట్ చేశాడు.

వరుస వికెట్లను ఆలస్యంగా పడేసిన లంక
ఇహ్‌సానుల్లా, రహమత్ నిలకడగా ఆడి రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. వరుస ఓవర్లలో ఇహ్‌సాన్, కెప్టెన్ అస్ఘర్ (1) అవుటైనా రహమత్‌కు హస్మతుల్లా (37) జత కలవడంతో అఫ్గాన్ ఇబ్బందిపడలేదు. 35వ ఓవర్‌లో రహమత్ కెరీర్‌లో 15వ హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ చమీర వేసిన 42వ ఓవర్‌లో రహమత్ వెనుదిరిగాడు. ఇక్కడి నుంచి లంక వరుసగా వికెట్లు పడగొట్టింది.

రహమత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
మలింగ వేసిన 49వ ఓవర్‌లో రషీద్ (13) విజృంభించి రెండు ఫోర్లు బాదగా మొత్తం 13 పరుగులు వచ్చాయి. రహమత్ షా (90 బంతుల్లో 5 ఫోర్లతో 72) హాఫ్ సెంచరీతో మెరవగా ఇహ్‌సానుల్లా జనత్ (65 బంతుల్లో 6 ఫోర్లతో 45) రాణించాడు. తిసారకు ఐదు, అకిలకు రెండు వికెట్లు దక్కాయి. రహమత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications