T20 world Cup 2022: అల్లాడించిన ఇంగ్లాండ్ బౌలర్లు.. 112 పరుగులకే ఆలౌట్ అయిన ఆఫ్ఘాన్..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పెర్త్ లో ఇంగ్లాండ్ తో జరుగుతోన్న సూపర్-12 మ్యాచ్ లో ఆఫ్ఘానిస్థాన్ 19.4ఓవర్లలో 112 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఆప్ఘాన్ ఇంగ్లీష్ బౌలర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ తక్కువ పరుగులకే ఔటయ్యారు. హజ్రతుల్లా జజాయ్ 7 పరుగులు చేయగా అతడిని స్టోక్స్ ఔట్ చేశాడు. 10 పరుగులు చేసిన రహ్మానుల్లా గుర్బాజ్ మార్క్ వుడ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.

ఇబ్రహీం జద్రాన్
ఆ తర్వాత వచ్చిన ఇబ్రహీం జద్రాన్, ఉస్మాన్ ఘనీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. 32 బంతుల్లో ఒక సిక్స్, మూడు ఫోర్లతో 32 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్ సామ్ కరన్ బౌలింగ్ మొయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నజీబుల్లా జద్రాన్ 13 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ మహ్మద్ నబీ కేవలం 3 పరుగులే చేసి మార్క్ వుడ్ కు చిక్కాడు. ఉస్మాన్ ఘనీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వేగంగా ఆడే క్రమంలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 8 పరుగులు చేసి సామ్ కరన్ బౌలింగ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

ఉస్మాన్ ఘనీ
ఈ తర్వాత వచ్చిన రషీద్ ఖాన్ డౌక్ ఔట్ అయ్యాడు. మరో ఆటగాడు ముజీబ్ ఉర్ రెహమాన్ కూడా డౌక్ ఔటయ్యాడు. సహచారులు ఔట్ అవుతున్నా ఉస్మాన్ ఘనీ పట్టువదలకుండా ఆడాడు. చివరికి 28 బంతుల్లో 30 పరుగులు చేసి సామ్ కరన్ బౌలింగ్ క్యాచి ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన ఫారుకీ సామ్ కరన్ బౌలింగ్ లోక్యాచ్ ఔటయ్యాడు.

సామ్ కరన్
ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ 3.4 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. బెన్ స్టోక్స్, మార్క్ వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్ ఒక వికెట్ తీశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications