For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

21వ శతాబ్దంలో ఒకేఒక్కడు.. షేన్‌ వార్న్‌ రికార్డును బ్రేక్ చేసిన రషీద్‌ ఖాన్!!

Afghanistan vs Zimbabwe: Rashid Khan breaks Shane Warnes unique record

అబుదాబీ: అఫ్గనిస్థాన్‌ స్టార్ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ అరుదైన ఘనత సాధించాడు. ప్రస్తుత తరంలో ఎవరికీ సాధ్యంకాని ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 21వ శతాబ్దంలో ఒకే టెస్ట్‌లో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్‌గా రషీద్‌ ఖాన్‌ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో ముగిసిన రెండో టెస్ట్‌లో రషీద్‌ 99.2 ఓవర్లు వేసి చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 36.3 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసిన రషీద్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 62.5 ఓవర్లు బౌలింగ్‌ చేసి 7 వికెట్లు పడగొట్టాడు.

వార్న్‌ రికార్డు బ్రేక్:

వార్న్‌ రికార్డు బ్రేక్:

2002లో కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్‌ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ 98 ఓవర్లు వేశాడు. ఆ రికార్డును తాజాగా రషీద్‌ ఖాన్ (99.2) బ్రేక్‌ చేశాడు. అయితే ఒక టెస్టులో అత్యధిక ఓవర్లు వేసిన ఘనత మాత్రం శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ పేరిట ఉంది. 1998లో ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో మురళీధరన్‌ 113.5 ఓవర్లు బౌల్‌ చేశాడు. ఆధునిక టెస్ట్‌ క్రికెట్‌లో మురళీ పేరిట ఈ రికార్డ్‌ నమోదైవుండగా.. 21వ శతాబ్దంలో మాత్రం రషీద్‌ పేరిటే ఈ రికార్డ్‌ లిఖించబడింది.

క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా:

క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా:

ఈ మ్యాచ్ మూడో రోజు మూడవ సెషన్‌లో అఫ్గాన్‌ ఫీల్డర్‌ హష్మతుల్లా షాహిది క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. ప్రత్యర్థి జట్టు టెయిలెండర్‌కు స్ట్రయికింగ్‌ రావాలనే వ్యూహంతో బంతిని ఆపే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఒక కాలును బౌండరీ అవతల పెట్టాడు. జింబాబ్వే బ్యాట్స్‌మన్ సికందర్ రాజా.. టెయిలెండర్‌ల సాయంతో తొలి ఇన్నింగ్స్‌ను నిర్మించే పనిలో ఉన్నాడు. అతనికి ముజారాబాని అండగా ఉన్నాడు. ఓవర్‌ చివరి బంతికి రజా సింగిల్ కోసం షాట్‌ ఆడాడు. అయితే తర్వాతి ఓవర్లో మళ్లీ రజాకు స్ట్రయికింగ్‌ రాకూడదనే ఉద్దేశంతో హష్మతుల్లా ఉద్దేశపూర్వకంగానే బౌండరీ అవతల కాలు వేశాడు. దీనిని గుర్తించిన ఫీల్డ్ అంపైర్లు ఒక పరుగును (బౌండరీతో కలిపి మొత్తం 5 పరుగులు) జింబాబ్వే జట్టుకు అదనంగా ఇచ్చారు. అంతేకాదు తర్వాతి ఓవర్లో రజాకే బ్యాటింగ్‌ అవకాశం కల్పించారు.

అఫ్గానిస్థాన్‌ విజయం:

అఫ్గానిస్థాన్‌ విజయం:

జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను అఫ్గానిస్థాన్‌ 1-1తో సమం చేసింది. రెండో టెస్టులో అఫ్గానిస్థాన్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫాలోఆన్‌ ఆడుతూ.. ఓవర్‌నైట్‌ స్కోరు 266/7తో చివరి రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన జింబాబ్వే 365 పరుగులకు ఆలౌటైంది. సీన్‌ విలియమ్స్‌ (151 నాటౌట్‌; 309 బంతుల్లో 13×4, 1×6).. తిరిపానో (95; 258 బంతుల్లో 16×4)తో కలిసి అఫ్గాన్‌ బౌలర్లను విసిగించాడు. తిరిపానోను రషీద్‌ ఖాన్‌ (7/137) ఔట్‌ చేయడంతో కాసేపటికే జింబాబ్వే ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆపై 108 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్‌ 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Story first published: Tuesday, March 16, 2021, 9:30 [IST]
Other articles published on Mar 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+