
హైదరాబాద్: లీడ్స్ వేదికగా ఆప్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నికోలస్ పూరన్ 43 బంతుల్లో 58(6 ఫోర్లు, ఒక సిక్స్), షాయ్ హోప్ 92 బంతుల్లో 77(6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఎవిన్ లూయిస్ 78 బంతుల్లో 58(6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండిస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. దీంతో ఆప్ఘనిస్థాన్‌కు 312 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆప్ఘన్ బౌలర్లలో జాద్రన్ రెండు వికెట్లు తీయగా... రషీద్ ఖాన్, షిర్జాద్, నబీ తలో వికెట్ తీశారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండిస్
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, మ్యాచ్ ఆరంభంలోనే వెస్టిండీస్‌కు షాక్ తగిలింది. ఓపెనర్ క్రిస్ గేల్(7) నిరాశపరచడంతో విండీస్ 21 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హోప్‌తో కలిసి ఎవిన్ లూయిస్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.
వీరిద్దరి జోడి రెండో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం సాధించిన తర్వాత ఎవిన్ లూయిస్ రెండో వికెట్‌గా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మహ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం హెట్‌మెయిర్‌తో కలిసి షాయ్ హోప్ 65 పరుగులు జోడించిన తర్వాత జట్టు స్కోరు 174 పరుగుల వద్ద హెట్ మెయిర్ ఔటయ్యాడు.
చివర్లో పూరన్, హోల్డర్‌లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ఆఖరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కార్లోస్ బ్రాత్‌వైట్ నాలుగు బంతులు ఆడి ఒక సిక్స్, రెండు ఫోర్లతో 14 పరుగులు చేయడంతో విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఆప్ఘన్ బౌలర్లలో దవ్లాత్ జద్రాన్ రెండు వికెట్లు తీయగా, నబీ, రషీద్ ఖాన్, షిర్జాద్ తలో వికెట్ తీశారు.