Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శ్రీలంకపై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్‌

Afghanistan vs Sri Lanka: Afghanistan have won the toss and have opted to field

ప్రపంచకప్‌లో భాగంగా సోఫియా గార్డెన్స్ వేదికగా మరికొద్ది సేపట్లో మాజీ చాంపియన్‌ శ్రీలంక, పసికూన అఫ్గానిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ కెప్టెన్ గుల్బదిన్‌ నైబ్‌ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు లంక ఒక మారుతో బరిలోకి దిగుతోంది. జీవన్ మెండిస్ స్థానంలో ప్రదీప్ జట్టులోకి వచ్చాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

తొలి పోరులో ఇరు జట్లు ఓటమిని ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. లంక కంటే అఫ్గానిస్తాన్‌ జట్టే బలంగా ఉంది. గతకొంత కాలంగా రాణిస్తూ క్రికెట్ లో ఎదుగుతున్న అఫ్గానిస్తాన్‌.. లంకపై పైచేయి సాధించినా ఆశ్చర్యం లేదు. ఇప్పటివరకు శ్రీలంక, అఫ్గానిస్తాన్‌ జట్లు మూడుసార్లు తలపడగా.. రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, మరో మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ గెలిచింది.

1
43650

జట్టు:
శ్రీలంక: దిముత్ కరుణరత్నె(కెప్టెన్), లాహిరు తిరుమానె, కుశాల్ పెరీరా (వికెట్ కీపర్), కుశాల్ మెండీస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, తిసార పెరీరా, ఇసురు ఉడాన, నువాన్ ప్రదీప్, సురంగ లక్మల్, లసిత్ మలింగ.

ఆప్ఘనిస్తాన్‌: హజ్రతుల్లా జజాయ్, మొహ్మద్ షహజద్ (వికెట్ కీపర్), రహ్మత్‌ షా, హష్మతుల్లా షాహిది, మొహమ్మద్‌ నబీ, గుల్బదిన్‌ నైబ్‌ (కెప్టెన్‌), నజీబుల్లా జద్రాన్‌ , రషీద్‌ ఖాన్, దౌలత్‌ జద్రాన్, ముజీబుర్‌ రహ్మాన్, హమీద్‌ హసన్.

Story first published: Tuesday, June 4, 2019, 15:03 [IST]
Other articles published on Jun 4, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+