Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFG vs NZ: 91 ఏళ్ల చరిత్రలో తొలిసారి.. చెత్త రికార్డు!

అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ అభిమానుల ఆశలకు వరుణుడు నీళ్లు చల్లాడు. నొయిడా వేదికగా అఫ్గానిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్‌ మధ్య జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ రద్దయింది. వర్షం కారణంగా అయిదో రోజు ఆట కూడా రద్దు చేస్తున్నట్లు అంపైర్లు శుక్రవారం ప్రకటించారు. దీంతో ఒక్క బంతి పడకుండా, కనీసం టాస్ కూడా లేకుండా టెస్టు మ్యాచ్ వర్షార్ఫణం అయ్యింది.

మైదానంలోని ప్రతికూల పరిస్థితులతో మొదటి రెండు రోజులు ఆట కొనసాగని విషయం తెలిసిందే. ఇక మూడు, నాలుగు రోజులు వర్షం కారణంగా రద్దు అయ్యింది. అయితే అయిదో రోజు అయినా కాసేపు అయిన ఆట కొనసాగుతుందనకుంటే వరుణుడు తన ప్రతాపం కొనసాగించాడు. అయితే ఈ క్రమంలో ఒక్క బంతి కూడా పడని అఫ్గానిస్థాన్-న్యూజిలాండ్ టెస్టు అరుదైన రికార్డుల జాబితాలో చేరింది.

Afghanistan vs sNew Zealand Test Abandoned in Noida First Rain-Out in Asia in 91 Years

ఆసియాలో వర్షం కారణంగా రద్దు అయ్యిన తొలి టెస్టు మ్యాచ్‌గా అఫ్గానిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ పోరు రికార్డులకెక్కింది. ఆసియాలో 91 ఏళ్ల టెస్టు చరిత్రలో, 730 మ్యాచ్‌ల్లో ఇలా జరగడం ఇదే ప్రథమం. ఈ చెత్త రికార్డుకు నొయిడా వేదికగా మారింది. ఓవరాల్‌గా టెస్టు చరిత్రలో బంతి పడకుండా రద్దయిన ఎనిమిదో మ్యాచ్ ఇది. 1890లో తొలిసారి ఇలా జరిగింది. మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ రద్దయింది.

1938లో మాంచెస్టర్ వేదికగానే ఇంగ్లండ్-ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ రద్దు అయ్యింది. ఆ తర్వాత 1970లో మరోసారి ఇంగ్లండ్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు మ్యాచే రద్దయ్యింది. అయితే ఈ సారి మెల్‌బోర్న్ వేదికగా ఆ రికార్డు నమోదైంది. 1989లో డునెడిన్ వేదికగా జరగాల్సిన న్యూజిలాండ్-పాకిస్థాన్, 1990లో గయానా వేదికగా జరగాల్సిన వెస్టిండీస్-ఇంగ్లండ్ టెస్టులు ఒక్క బంతి పడకుండానే రద్దయ్యాయి.

1998 డిసెంబర్‌లో ఫైసలాబాద్‌లో జరగాల్సిన పాకిస్థాన్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్ రద్దయ్యింది. అయితే ఈ మ్యాచ్ ఫలితం ప్రకటించిన ఒక్క రోజు అనంతరమే డునెండ్ వేదికగా జరగాల్సిన న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ కూడా రద్దయ్యింది. ఇప్పుడు ఈ జాబితాలో నొయిడా వేదికగా జరగాల్సిన అఫ్గాన్-కివీస్ మ్యాచ్ చేరింది. ఈ మ్యాచ్ సక్రమంగా జరిగితే చరిత్రలో 2549 టెస్టుగా నమోదయ్యేది.

Story first published: Friday, September 13, 2024, 9:38 [IST]
Other articles published on Sep 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+