For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20WC: సంచలనం.. కమిన్స్ మరో హ్యాట్రిక్ (Video)

టీ20 వరల్డ్ కప్-2024లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ మరో సంచలనం సృష్టించాడు. సెయింట్ విన్సెంట్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. 18వ ఓవర్ చివరి బంతికి రషీద్ ఖాన్‌ (2; 4 బంతుల్లో)ను ఔట్ చేసిన కమిన్స్ ఆ తర్వాత 20వ ఓవర్ తొలి రెండు బంతులకు వికెట్లు తీసి హ్యాట్రిక్ ఘనత అందుకున్నాడు.

ఆఖరి ఓవర్ తొలి బంతికి షాట్‌కు యత్నించిన కరీమ్ జనత్ (13; 9 బంతుల్లో, 1 సిక్సర్)ను, రెండో బంతికి గుల్బాదిన్‌ను ఔట్ చేసి కమిన్స్ హ్యాట్రిక్ సాధించాడు. ఆ తర్వాతి బంతికి కూడా కమిన్స్ ఖాతాలో వికెట్ పడేది. ఖరోటే ఇచ్చిన క్యాచ్‌ను డేవిడ్ వార్నన్ జారవిడిచాడు. కమిన్స్ (3/28)తో పాటు ఆడమ్ జంపా (2/28) కూడా సత్తాచాటడంతో అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది.

Afghanistan vs Australia Pat Cummins Secures Consecutive Hat-Tricks in T20 World Cup Sensation

అయితే అఫ్గాన్‌కు గొప్ప ఆరంభం లభించింది. ఓపెనర్లు గుర్బాజ్ (60; 49 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (51; 48 బంతుల్లో, 6 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 11.5 ఓవర్లలో 118 పరుగులు జోడించారు. అయితే అఫ్గాన్ ఓపెనర్లు క్రీజులో పాతుకుపోయినప్పటికీ ఆఖర్లో ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. గేర్ మార్చి దూకుడుగా ఆడే యత్నంలో వికెట్లు చేజార్చుకున్నారు. ఎనిమిది బంతుల వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరారు.

అనంతరం ఆస్ట్రేలియా పైచేయి సాధించింది. అఫ్గానిస్థాన్‌ కోలుకోకుండా వరుసగా వికెట్లు తీసింది. దీంతో సులువుగా 170-180 పరుగులు సాధించేలా కనిపించిన అఫ్గాన్ 148 పరుగులతో సరిపెట్టుకుంది. మహ్మద్ నబీ (10 నాటౌట్; 4 బంతుల్లో, 2 ఫోర్లు) ఆఖర్లో రెండు ఫోర్లు బాదాడు.

Story first published: Sunday, June 23, 2024, 8:54 [IST]
Other articles published on Jun 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+