
ఆగస్టు 27 నుంచి యూఏఈలో జరగనున్న ఆసియా కప్ - 2022 కోసం 17మంది సభ్యులతో కూడిన జట్టును ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఐర్లాండ్‌లో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌కు నాయకత్వం వహిస్తున్న మహ్మద్ నబీ ఆసియాకప్ జట్టుకు కూడా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐర్లాండ్ సిరీస్‌లో జట్టులో భాగమైన షరాఫుద్దీన్ అష్రాఫ్ స్థానంలో సమీవుల్లా షిన్వారీ జట్టులోకి వచ్చాడు. ఎడమ చేతి మణికట్టు స్పిన్నర్ అయిన నూర్ అహ్మద్ కూడా జట్టులోకి వచ్చాడు. దీంతో ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ లాంటి స్పిన్నర్లతో ఆఫ్ఘాన్ జట్టు స్పిన్ విభాగం దుర్భేద్యంగా కన్పిస్తుంది. ఇక నజీబుల్లా జద్రాన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గత సంవత్సరం టీ20 ప్రపంచకప్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా ఆడిన గుల్బాదిన్ నైబ్ జట్టుకు ఎంపికకాకపోవడం ఆశ్చర్యకరంగా అనిపించింది. అతను టీ20 ప్రపంచకప్ నుంచి జట్టుకు సెలెక్ట్ కాలేదు.

ఆసియా కప్ - 2022 కోసం ఎంపికైన ఆఫ్ఘనిస్తాన్ జట్టు
మహ్మద్ నబీ (కెప్టెన్ ), నజీబుల్లా జద్రాన్ (వైస్ కెప్టెన్), అఫ్సర్ జజాయ్ (వికెట్ కీపర్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఫరీద్ అహ్మద్ మాలిక్, ఫజల్ హక్ ఫారూఖీ, హష్మతుల్లా షాహిదీ, హజ్రతుల్లా జజాయ్, ఇబ్రహీం జద్రాన్, కరీం బుల్ రహ్‌మాన్, ముజీబ్, ముజీబ్ హక్, నూర్ అహ్మద్, రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), రషీద్ ఖాన్, సమీవుల్లా షిన్వారీ.
ఆసియా కప్ 2022 కోసం 17మంది సభ్యులతో జట్టును ప్రకటించిన ఆఫ్ఘనిస్తాన్ బోర్డు ముగ్గురు రిజర్వ్ ఆటగాళ్లను కూడా పేర్కొంది. వాళ్లు నిజత్ మసూద్, కైస్ అహ్మద్, షరాఫుద్దీన్ అష్రఫ్. ఇక ఆగస్టు 27న శ్రీలంకతో గ్రూప్ బీలో ఆఫ్ఘనిస్తాన్ తమ మ్యాచ్ ఆడబోతుంది. ఆగస్టు 30న బంగ్లాదేశ్‌తో ఆఫ్ఘానిస్థాన్ తన రెండో మ్యాచ్ ఆడనుంది. రెండు గ్రూపుల్లోని ప్రతి 2 జట్లు ఆసియా కప్‌లో సూపర్ 4దశకు అర్హత సాధిస్తాయి. సూపర్ 4లో మళ్లీ ప్రతి జట్టు మరో మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. ఇక గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, క్వాలిఫయర్ టీం ఉంటాయి.