బంగ్లాతో ఏకైక టెస్టు: అరుదైన ఘనత సాధించిన రషీద్ ఖాన్

హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో పిన్న వయసులో కెప్టెన్‌గా వ్యహరిస్తున్న రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. గురువారం బంగ్లాదేశ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.
ఈ క్రమంలోనే జింబాబ్వే మాజీ కెప్టెన్ తైబు పేరిట ఉన్న రికార్డును రషీద్ ఖాన్ బద్దలు కొట్టాడు. తైబు 20 ఏళ్ల 358 రోజుల వయసులో జింబాబ్వే తరుఫున కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు రషీద్ ఖాన్ 20 ఏళ్ల 350 రోజుల వయసులో ఆప్ఘనిస్థాన్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా నియమించబడటంతో తైబు రికార్డును అధిగమించాడు.

రషీద్ ఖాన్ అరుదైన ఘనత
తైబు కంటే రషీద్ ఖాన్ కేవలం 8 రోజుల ముందంజలో ఉండటంతో ఈ ఘనత సాధించాడు. తైబు తన 21వ పుట్టినరోజుని మరో 7 రోజుల్లో జరుపుకుంటాడనగా... 2006 మే6న హరారే వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టుకు కెప్టెన్‌గా వ్వవహారించాడు. ఈ జాబితాలో రషీద్ ఖాన్, తైబుల తర్వాత భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఉన్నారు.

పటౌడీ 21 ఏళ్ల 77 రోజుల వయసులో
పటౌడీ 21 ఏళ్ల 77 రోజుల వయసులో భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా సేవలందించారు. 1962, మార్చి 23న మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 21 ఏళ్ల 77 రోజుల వయసులో ఉన్నప్పుడు వెస్టిండిస్ జట్టుపై తన కెప్టెన్సీ అరంగేట్రం చేశాడు. కాగా, బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన రషీద్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

టెస్టు హోదా పొందిన తర్వాత ఆడుతున్న మూడో టెస్టు
గతేడాది ఆప్ఘనిస్థాన్ జట్టు టెస్టు హోదా పొందిన తర్వాత ఆడుతున్న మూడో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. బెంగళూరు వేదికగా ఇండియాతో జరిగిన తొలి టెస్టులో ఆప్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో ఓడిపోగా... ఆ తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

జట్ల వివరాలు:
బంగ్లాదేశ్: షాద్మాన్ ఇస్లాం, సౌమ్య సర్కార్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), మహముదుల్లా రియాద్, మొసాద్దేక్ హుస్సేన్ సైకాట్, లిటన్ దాస్, తైజుల్ ఇస్లాం, మెహిదీ హసన్ మీరాజ్, నయీమ్ హసన్.
ఆఫ్ఘనిస్తాన్: ఇహ్సానుల్లా జనత్, ఇబ్రహీం జాద్రాన్, రహమత్ షా, హష్మతుల్లా షాహిది, అస్గర్ ఆఫ్ఘన్, మొహమ్మద్ నబీ, అఫ్సర్ జజాయ్, రషీద్ ఖాన్ (కెప్టెన్), యామిన్ అహ్మద్జాయ్, ఖైస్ అహ్మద్, జహీర్ ఖాన్
అంపైర్లు: నిగెల్ లాంగ్(ఇంగ్లాండ్) - పాల్ విల్సన్(ఆస్ట్రేలియా)
టీవీ అంపైర్: నితిన్ మీనన్(ఇండియా) మ్యాచ్ రిఫరీ: క్రిస్ బ్రాడ్(ఇంగ్లాండ్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications