For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ తెలివికి బిత్తరపోయిన అఫ్గానిస్థాన్..అంపైర్లకు కంప్లైంట్!

దాదాపు 14 నెలల తర్వాత రోహిత్ శర్మ తిరిగి టీ20 ఫార్మాట్‌కు వచ్చాడు. అఫ్గానిస్థాన్ సిరీస్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగాడు. కానీ తొలి రెండు టీ20ల్లో డకౌటయ్యాడు. తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు రనౌటవ్వగా, రెండో టీ20లో దూకుడుగా ఆడి వెనుదిరిగాడు. అయితే మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కష్టాల్లో నిలిచిన టీమిండియాను రింకూ సింగ్ (69*; 39 బంతుల్లో)తో కలిసి అద్భుత పోరాటంతో ఆదుకున్నాడు.

22 పరుగులకే నాలుగు వికెట్లు పడటంతో తొలుత రోహిత్ నిదానంగా ఆడాడు. ఓ సమయంలో 34 బంతుల్లో 28 పరుగులే చేసిన అతడు ఇన్నింగ్స్ పూర్తయ్యే సరికి 69 బంతుల్లో 121 రన్స్ చేశాడు. 11 ఫోర్లు , 8 సిక్సర్లు బాదాడు. 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు కూడా సింగిల్‌కు ట్రై చేయకుండా బౌండరీతో సెంచరీ సాధించాడు. కాగా, భారత్ నిర్దేశించిన 213 భారీ లక్ష్యం కోసం శ్రమించిన అఫ్గానిస్థాన్ స్కోరును సమం చేసింది.

Afghanistan shocked by Rohit Sharmas intelligence. Compliant with the umpires!

అయితే సూపర్ ఓవర్‌లో రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయానికి అఫ్గానిస్థాన్ జట్టు షాక్ అయ్యింది. ఏం చేయాలో తెలియక అంపైర్ల వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. అసలేం జరిగిదంటే.. తొలి సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 16/1తో నిలిచింది. ముకేశ్ కుమార్ వేసిన తొలి బంతికి నైబ్ రనౌటవ్వగా, తర్వాత నబి, గుర్బాజ్ చెలరేగి పరుగులు సాధించారు. అనంతరం సూపర్ ఓవర్ ఛేజింగ్‌లో రోహిత్ రెండు సిక్సర్లు బాదాడు. అయిదో బంతికి సింగిల్ తీసి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌కు చేరుకున్నాడు.

భారత్ విజయం సాధించాలంటే ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాలి. దీంతో రోహిత్ తెలివిగా వ్యవహరించాడు. తన కంటే రింకూ సింగ్ వేగంగా పరిగెత్తగలడని రిటైర్డ్ హట్‌గా మైదానాన్ని విడిచాడు. దీంతో అఫ్గానిస్థాన్ ప్లేయర్లు అంపైర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసి వివరణ కోరారు. రూల్స్‌కు అనుగుణంగానే రోహిత్ వెళ్లాడని అంపైర్లు వివరించారు. రోహిత్ వ్యూహాలకు తగ్గట్టుగానే రింకూ సింగ్ చిరుతలా పరిగెత్తి సూపర్ ఓవర్‌ను టైగా ముగించాడు.

Afghanistan shocked by Rohit Sharmas intelligence. Compliant with the umpires!

అయితే రెండో సూపర్ ఓవర్‌లోనూ రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు రావడంతో మరోసారి అఫ్గానిస్థాన్ ప్లేయర్లు అంపైర్లతో చర్చించారు. రిటైర్డ్ ఔట్‌గా రోహిత్ వెళ్లలేదని, రిటైర్డ్ హట్‌గా మైదానాన్ని అతడు వీడటంతో బ్యాటింగ్ చేయొచ్చని అంపైర్లు వివరించారు. నిబంధనల ప్రకారం తొలి సూపర్ ఓవర్‌లో ఔటైన ప్లేయర్లు రెండో సూపర్ ఓవర్‌లో బ్యాటింగ్ చేయడానికి వీళ్లేదు. అలాగే తొలి సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేసిన బౌలర్లు రెండో సూపర్ ఓవర్‌లోనూ బౌలింగ్ వేయకూడదు.

కాగా, రెండో సూపర్ ఓవర్‌లో అవేశ్ ఖాన్‌తో కాకుండా రవి బిష్ణోయ్‌తో బౌలింగ్ చేయించిన రోహిత్ వ్యూహం ఫలించింది. 12 పరుగుల లక్ష్యాన్ని అఫ్గాన్ సులువుగా ఛేదన చేస్తుందనుకుంటే ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫరీద్ బౌలింగ్‌లో రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులే చేసింది. తొలి మూడు బంతులకు రోహిత్ 11 పరుగులు చేయగా, తర్వాత భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం రవి బిష్ణోయ్‌ అద్భుత బౌలింగ్‌తో రెండో సూపర్ ఓవర్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తొలి బంతికే నబి ఔటవ్వగా, రెండో బంతికి ఒక్క పరుగు వచ్చింది. మూడో బంతికి గుర్బాజ్ ఔటయ్యాడు.

Story first published: Thursday, January 18, 2024, 12:07 [IST]
Other articles published on Jan 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+