For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అద్భుతం: 2019 వన్డే వరల్డ్‌కప్‌కు అప్ఘనిస్థాన్ అర్హత

By Nageshwara Rao
Afghanistan seal World Cup berth

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్న అప్ఘనిస్థాన్‌ మరోసారి సత్తా చాటింది. శుక్రవారం క్వాలిఫయర్స్‌ సూపర్‌ సిక్స్‌ చివరి మ్యాచ్‌లో అప్ఘనిస్థాన్‌ ఐదు వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించి టోర్నీలో ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పటికే వెస్టిండిస్‌ బెర్తు సంపాదించగా తాజాగా రెండో బెర్తును అప్ఘనిస్థాన్ కైవసం చేసుకుంది.

వరల్డ్ కప్‌కు ఆప్ఘనిస్థాన్ క్వాలిపై కావడం అద్భుతమనే చెప్పాలి. గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌ల్లో ఒక్క దానిలోనూ గెలవని అఫ్ఘానిస్థాన్‌ సున్నా పాయింట్లతో సూపర్‌ సిక్స్‌లో ప్రవేశించింది. అయితే, సూపర్‌సిక్స్‌లో విండీస్‌, ఐర్లాండ్‌, జింబాబ్వేపై విజయం సాధించడంతోపాటు ఇతర మ్యాచ్‌ల ఫలితాలు కూడా అఫ్ఘాన్‌ జట్టు వరల్డ్‌ కప్‌ కలను సాకారం చేశాయి.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. స్టిర్లింగ్‌ (55), కెవిన్‌ ఓబ్రైన్‌ (41), నీల్‌ ఓబ్రైన్‌ (36) పరుగులతో రాణించారు. క్వాలిఫయర్స్‌ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన చేస్తున్న స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌.. అప్ఘనిస్థాన్ ప్రపంచకప్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు.

ఈ మ్యాచ్‌లో కూడా రషీద్ ఖాన్ 40 పరుగులే ఇచ్చిన మూడు వికెట్లు తీశాడు. స్పిన్నర్ రషీద్ ఖాన్ 3, దౌలత్ జద్రాన్ 2 వికెట్లు తీశారు. అనంతరం ఐర్లాండ్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్థాన్ 49.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసి ఛేదించింది. ఆప్ఘన్ బ్యాట్స్‌మెన్లు మహ్మద్‌ షెజాద్‌ (54), గుల్బాదిన్‌ నైబ్‌ (45), స్తానిక్‌జాయ్‌ (39 నాటౌట్‌) విజయంలో కీలక పాత్ర పోషించారు.

షహజాద్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. లీగ్ దశలో స్కాట్లాండ్, జింబాబ్వే, హాంకాంగ్ చేతిలో ఓడిన ఆఫ్ఘనిస్థాన్.. సూపర్ సిక్స్‌లో వరుసగా వెస్టిండీస్, యూఏఈ, ఐర్లాండ్‌పై గెలిచింది. ఐసీసీ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించడం ఆఫ్ఘనిస్థాన్‌కు ఇది రెండోసారి. 2015లో ఈ టోర్నీలో తొలిసారి బరిలోకి దిగింది.

Story first published: Saturday, March 24, 2018, 16:07 [IST]
Other articles published on Mar 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+