జింబాబ్వేపై అలవోక విజయం: రెండు టీ20ల సిరిస్ ఆప్ఘన్‌దే

హైదరాబాద్: జింబాబ్వేతో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను ఆప్ఘనిస్థాన్ 2-0తో కైవసం చేసుకుంది. షార్జా వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20లో ఆ జట్టు 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టీ20ని 5 వికెట్ల తేడాతో నెగ్గిన ఆప్ఘన్ జట్టు, ఇప్పుడు రెండో టీ20లో కూడా గెలిచి సిరిస్‌ను కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. మహ్మద్ నబి (45), స్తానిక్‌జాయ్ (27) పరుగులతో రాణించారు. అనంతరం 159 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఏ దశలోనే పోటీ ఇవ్వలేకపోయింది.
మూడో ఓవర్‌లో ఓపెనర్ సోలోమన్ మిరే (2) పరుగుల వద్ద జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత సికిందర్ రజా (40), మసకద్జ (29), బుర్ల్ (30) పోరాడినా ఫలితం లేకపోయింది. దీంతో జింబాబ్వే
నిర్ణీత ఓవర్లలో 20 వికెట్లు కోల్పోయి 141 పరుగులే చేయగలిగింది.
ఆప్ఘనిస్థాన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మాన్ (2/21), రషీద్ ఖాన్ (2/23) జింబాబ్వేని కట్టడి చేశారు. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరిస్ శుక్రవారం (ఫిబ్రవరి 9) నుంచి ప్రారంభం కానుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications