టీ20ల్లో డబుల్ సెంచరీ: చరిత్ర సృష్టించిన ఆప్ఘన్ క్రికెటర్
హైదరాబాద్: టీ20 క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేయడం చాలా అరుదు. అలాంటిది ఆప్ఘనిస్థాన్ వికెట్ కీపర్ షఫీకుల్లా షఫక్ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఆఫ్ఘన్‌లో స్ధానికంగా జరిగిన ఓ టీ20 టోర్నమెంట్‌లో ఖతీజ్ క్రికెట్ అకాడమీ తరపున ఆడిన షఫిక్(214) డబుల్ సెంచరీ సాధించాడు.
71 బంతుల్లో 21 సిక్సర్లు, 16 ఫోర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి డబుల్ సెంచరీ సాధించాడు. షఫీకుల్లా షఫక్ డబుల్ సెంచరీతో ఖతీజ్ క్రికెట్ అకాడమీ 351 పరుగులు భారీ స్కోరు చేసింది. అనంతరం 352 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కాబూల్ స్టార్ క్రికెట్ జట్టు కేవలం 107 పరుగులకే ఆలౌటైంది.

గత మూడు టీ20 వరల్డ్ కప్‌ల నుంచి అఫ్ఘనిస్థాన్ జాతీయ జట్టులో షఫికుల్లా సభ్యుడిగా ఉన్నాడు. 2012, 2014, 2016లలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌ల్లో షఫికుల్లా ఆఫ్ఘనిస్థాన్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2014 వరల్డ్ టీ 20లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.
ఇది ఆ దేశం తరపున అత్యంత వేగంగా నమోదైన అర్ధ సెంచరీగా రికార్డు సృష్టించింది, ఆ మ్యాచ్‌లో అఫ్ఘాన్ గెలిచి వరల్డ్ టీ20లో తొలి గెలుపుని ఆస్వాదించింది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు 35 టీ20లు ఆడిన షఫక్ 392 పరుగులు చేశాడు. షఫక్ అత్యధిక స్కోరు 51 పరుగులు మాత్రమే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications