Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ రికార్డును దాటేసిన ఆఫ్గనిస్తాన్ ఆటగాడు

గ్రేటర్ నోయిడా: ఆఫ్గనిస్తాన్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ మహ్మద్‌ షాజాద్‌ అరుదైన రికార్డును సాధించాడు. తద్వారా ట్వంటీ 20ల్లో భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీ సాధించిన పరుగులను అధిగమించాడు.

అఫ్గానిస్థాన్‌ - ఐర్లాండ్‌ మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో అఫ్గాన్‌ ఆటగాడు షాజాద్‌ 62 బంతుల్లో 72 పరుగులు చేశాడు. దీంతో ట్వంటీ 20ల్లో అత్యధిక పరుగులు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

Afghanistan’s Mohammad Shahzad goes past Virat Kohli in T20Is

నాలుగో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీని షాజాద్‌ ఐదో స్థానానికి నెట్టాడు. ప్రస్తుతం కోహ్లీ 1,709 పరుగులతో అయిదో స్థానంలో ఉన్నాడు. మొత్తం 58 మ్యాచ్‌ల ద్వారా షహ్జాద్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.

అయితే కోహ్లీ 48 మ్యాచ్‌ల్లో 44 ఇన్నింగ్స్‌ల ద్వారా 1,709 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు మెకల్లమ్ 2,140 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో దిల్షాన్‌ 1,889, మార్టిన్ గప్తిల్‌ 1,806తో ఉన్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై అఫ్గానిస్థాన్‌ 28పరుగుల తేడాతో విజయం సాధించి 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+