న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పది ఓవర్లకే తొలి వికెట్ అవకాశాన్ని కోల్పోయిన అఫ్ఘనిస్థాన్..??

Afghanistans first Test wicket was denied by the umpire

హైదరాబాద్: భారత్‌తో బెంగళూరు వేదికగా గురువారం ఆరంభమైన చారిత్రక టెస్టు మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌ జట్టు ఆదిలోనే వికెట్ అవకాశాన్ని చేజార్చుకుంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ వేసిన ఫాస్ట్ బౌలర్ వఫాదర్ బౌలింగ్‌లో బంతిని డిఫెన్స్ చేసేందుకు ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రయత్నించాడు. కానీ.. కొద్దిగా టర్న్ తీసుకున్న బంతి అతని బ్యాట్ అంచున తాకుతూ వెళ్లి వికెట్ కీపర్ అఫ్సర్ జజాయ్ చేతుల్లో పడింది. దీంతో.. ఔట్ కోసం అతను అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు.

 బ్యాట్‌ అంచున తాకిందని కీపర్‌ చెప్పినా..:

బ్యాట్‌ అంచున తాకిందని కీపర్‌ చెప్పినా..:

బంతి కచ్చితంగా బ్యాట్‌ అంచున తాకిందని కీపర్‌ జజాయ్ చెప్పినా.. అఫ్గానిస్తాన్ కెప్టెన్ అస్గర్‌ అతడ్ని విశ్వసించలేదు. పక్కనే స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మహ్మద్ షెజాద్ కూడా తనకు ఎలాంటి శబ్ధం వినిపించలేదని చెప్పడంతో.. అస్గర్‌ డీఆర్‌ఎస్ (రివ్వ్యూ) కోరలేదు. కానీ.. టీవీ రిప్లేలో బ్యాట్‌ అంచున బంతి తాకినట్లు స్పష్టంగా కనిపించింది.

 10 ఓవర్లలో తొలి వికెట్‌ సాధించే అవకాశాన్ని:

10 ఓవర్లలో తొలి వికెట్‌ సాధించే అవకాశాన్ని:

దాంతో 10 ఓవర్లలో తొలి టెస్టు వికెట్‌ సాధించే అవకాశాన్ని అఫ్ఘనిస్థాన్ కోల్పోయినట్లైంది. ఆ పది ఓవర్లకు టీమిండియా స్కోరు ధావన్ 24, మురళీ విజయ్ కింద ఉంది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ధావన్ కేవలం 47 బంతుల్లోనే 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 50 పరుగులు పూర్తి చేశాడు.

87 బంతుల్లోనే 100 పరుగుల మైలురాయిని:

87 బంతుల్లోనే 100 పరుగుల మైలురాయిని:

కేవలం 87 బంతుల్లోనే 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఆ తర్వాత లంచ్ విరామం ముగించుకుని బ్యాటింగ్‌కు దిగిన 28.4 ఓవర్‌కి యామిన్ అహ్మద్‌జై బౌలింగ్‌లో ధావన్ కొట్టిన షాట్‌ను నబీ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఇలా 96 బంతులు ఆడిన ధావన్ 107 పరుగులతో ఇన్నింగ్స్ ముగించాడు.

తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌:

తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌:

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న చారిత్రాత్మక టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత తాత్కాలిక టెస్టు కెప్టెన్ రహానే తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. వన్డేల్లో, టీ20ల్లో అదరగొట్టేస్తున్న ఆఫ్గానిస్థాన్‌ తొలిసారి సుదీర్ఘ ఫార్మాట్‌లో బరిలోకి దిగుతుండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలున్నాయి.

Story first published: Thursday, June 14, 2018, 13:19 [IST]
Other articles published on Jun 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X