ప్రపంచకప్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇదే

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుండి ప్రపంచకప్ మెగా సమరం ప్రారంభం కానుంది. ప్రపంచకప్‌లో పాల్గొనే అన్ని జట్లు ఈ నెల 23లోగా 15 మందితో కూడిన జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్న కూడా ప్రపంచకప్‌లో గుల్బోడిన్ నాయిబ్ కి సారధ్య బాధ్యతలు అప్పగించింది

3 సంవత్సరాల తర్వాత చోటు:
మూడు సంవత్సరాల విరామం తర్వాత ఆఫ్గనిస్తాన్ సీమ్ బౌలర్ హమీద్ హస్సన్ జట్టులోకి వచ్చాడు. హమీద్ చివరిసారిగా 2016లో ఐర్లాండ్ సిరీస్ లో ఆడాడు. అనంతరం గాయాల కారణంగా జట్టుకు దూరమయి అనూహ్యంగా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టీ20లో కూడా అతను చివరిసారిగా గత సంవత్సరం ఫిబ్రవరిలో ఆడాడు. అయితే 2015 ప్రపంచకప్‌లో 8 వికెట్లతో అద్భుతంగా రాణించాడు.

రషీద్, నబీలు కీలకం:
గుల్బోడిన్ నాయిబ్, మొహమ్మద్ షహజాద్, రహ్మాత్ షా, నజీబుల్లా జద్రన్, ఆఫ్ఘన్లు బ్యాటింగ్ విభాగం మోయనున్నారు. రషీద్, నబీలు స్పిన్నర్లుగా మరియు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా జట్టుకు సేవలందించనున్నారు. ఈ ఇద్దరు జట్టులో చాలా కీలకం. ముజీబ్ ఉర్ రెహమాన్ మూడో స్పిన్నర్. హమీద్ హస్సన్, దావ్లత్ జద్రన్, అఫ్తాబ్ ఆలం పేస్ విభాగం పంచుకోనున్నారు.

ముందుగా న్యూజీలాండ్:
మెగా టోర్నీ కోసం అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. ముందుగా న్యూజీలాండ్ బోర్డు ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టును ప్రకటించగా.. ఆస్ట్రేలియా, భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక బోర్డులు ఆ తర్వాత ప్రకటించాయి. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ బోర్డు కూడా 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు:
గుల్బోడిన్ నాయిబ్ (కెప్టెన్), మహ్మద్ షహజాద్, నూర్ అలీ జద్రన్, హజ్రదుల్లా జాజి, రెహ్మాత్ షా, అస్ఘర్ ఆఫ్ఘన్, హష్మతుల్లా షహీది, నజీబుల్లా జద్రన్, సమీఉల్లాహ్ శిన్వారీ, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, దావ్లత్ జద్రన్, అఫ్తాబ్ ఆలం, హమీద్ హస్సన్, ముజీబ్ ఉర్ రెహమాన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications