AFG vs AUS: ఆసీస్‌తో మ్యాచ్ ముందు ఆఫ్ఘన్ ఆటగాళ్ల ప్రార్థనలు.. ఫలితం దక్కేనా?
AFG vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లు ఎలాగైనా సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాయి. ఇంగ్లాండ్ కు షాక్ ఇచ్చి జోరుమీదున్న ఆఫ్ఘనిస్తాన్.. కంగారూలను ఓడించి సెమీస్ కు దూసుకెళ్లాలని ప్రణాళికలను రచిస్తోంది. ఆస్ట్రేలియాతో జరగనున్న కీలక మ్యాచ్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ పోస్ట్ కు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆఫ్ఘన్ ఆటగాళ్లలో ఇది ఐక్యతకు నిదర్శనమని.. వారికి దేశం మీద ఉన్న భక్తి కనిపిస్తోందని నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని వారికి తమ మద్దతును తెలియజేస్తున్నారు.

తాజాగా ఈ మ్యాచ్ కు సంబంధించి ఆఫ్ఘనిస్తాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చేయనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే తొలిసారిగా ఆఫ్ఘనిస్తాన్, ఆసీస్ జట్లు తలపడుతున్నాయి. వన్డే క్రికెట్ లో ఇంతకు ముందు ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లు జరిగాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు మొత్తం 4 వన్డేల్లో తలపడగా.. ఈ నాలుగు మ్యాచ్ ల్లోనూ ఆస్ట్రేలియానే గెలిచింది.
ఆఫ్ఘనిస్తాన్ తొలి విజయం కోసం చూస్తోంది. ఇరు జట్లకూ గెలిచే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ ను ఓడించిన తర్వాత ఏది గెలుస్తుందో చెప్పడం అంత సులువేం కాదు. ఆస్ట్రేలియా గతంలో పైచేయి సాధించినప్పటికీ.. ఆఫ్ఘనిస్తాన్ ను తక్కువగా అంచనా వేయలేం. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓడిపోతే ట్రోఫీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.
Afghanistan Players offered Prayers ahead of the Australia match in Champions Trophy 🌟 pic.twitter.com/oEKBuTtBx1
— Johns. (@CricCrazyJohns) February 28, 2025
ఇరు జట్లు ఇవే..
ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్(సి), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కేరీ(wk), గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్(WK), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయిబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫారూఖీ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications