Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs AFG: ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమి.. ఏడ్చేసిన జో రూట్.. వీడియో వైరల్

ENG vs AFG: లాహోర్‌లో జరిగిన మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్‌ను 8 పరుగుల తేడాతో ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బయటకు పంపింది. ఈ గెలుపులో ఇబ్రహీం జద్రాన్ రికార్డు సెంచరీ(177), అజ్మతుల్లా ఒమర్జాయ్ ఐదు వికెట్లు కీలక పాత్ర పోషించాయి. ఈ డూ ఆర్ డై మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది.

అనంతరం ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ సెమీ-ఫైనల్ రేసులో కొనసాగుతుండగా.. ఇంగ్లాండ్ జట్టు ప్రయాణం ఇక్కడితో ముగిసింది. జో రూట్ 120 పరుగులు చేసినా ఇంగ్లాండ్ ను ఓటమి నుంచి కాపాడలేకపోయాడు.

Afghanistan knocked England out of the Champions Trophy 2025 Joe Root Seen Crying - Viral Video

ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గెలిచిన వెంటనే జో రూట్ కళ్లలో నీళ్లు తిరిగాయి. జో రూట్ ఈ మ్యాచ్ తర్వాత ఏడుస్తున్నట్లు కనిపించాడు. ఈ మ్యాచ్ తర్వాత జోస్ బట్లర్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశాడు. మ్యాచ్ ఓటమి అనంతరం ఈ క్షణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2023 ప్రపంచ కప్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఇంగ్లాండ్ కు ఇది వరుసగా రెండో వన్డే ఓటమి. చివరి ఓవర్ లో ఇంగ్లాండ్ గెలవడానికి 13 పరుగులు అవసరం. కానీ ఒమర్జాయ్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఆదిల్ రషీద్ ను ఔట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కు అద్భుత విజయాన్ని అందించాడు.

Story first published: Thursday, February 27, 2025, 13:03 [IST]
Other articles published on Feb 27, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+