Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFG VS ENG: ఇదీ కదా హీరోయిజం అంటే.. భారీ శతకంతో చరిత్ర సృష్టించిన అప్ఘాన్ బ్యాటర్..

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా అఫ్ఘానిస్థాన్‌ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న మ్యాచ్‌ లో అదిరే సెంచరీ నమోదైంది. వరుస వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లోకి వెళ్లిపోయిన సమయంలో.. తీవ్ర ఒత్తిడి పరిస్థితిని ఎదుర్కొని సెంచరీ బాదాడు అప్ఘాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలోనే అఫ్ఘానిస్థాన్‌ బ్యాటర్లలో శతకం బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో అతడికి ఇది ఆరో సెంచరీ.

ఈ మ్యాచ్ లో అప్ఘానిస్థాన్ ఆరంభం గొప్పగా దక్కలేదు. 5 ఓవర్లకే 2 వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసింది. ఒకే ఓవర్ లో ఆర్చర్ రెండు వికెట్లు తీసి దెబ్బకొట్టాడు. ఆ తర్వాత మూడో వికెట్ కూడా అతడే తీశాడు. దీంతో అప్ఘాన్ తొలి 9 ఓవర్లకే 37/3 కష్టాల్లోకి వెళ్లిపోయింది. కానీ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఆడాడు. సమయోచితంగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అతడికి హష్మాతుల్లా షాహిది మంచి సహకారం అందించాడు. దీంతో నాలుగో వికెట్ కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అనంతరం శతక భాగస్వామ్యం కూడా నెలకొల్పారు.

Afghanistan Ibrahim Zadran Scores Century in Champions Trophy 2025 eng vs afg match

ఈ క్రమంలోనే ఓపెనర్ వచ్చిన ఇబ్రహీం జద్రాన్ 106 బంతుల్లో శతకం నమోదు చేశాడు. 3 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడి అత్యధిక వ్యక్తి స్కోరు 162. కాగా, ఇబ్రహీం జద్రాన్ సెంచరీ బాదిన సమయానికి అఫ్ఘాన్‌ స్కోరు 201/4 (37 ఓవర్లకు)గా ఉంది.

Story first published: Wednesday, February 26, 2025, 18:00 [IST]
Other articles published on Feb 26, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+