ఫస్ట్‌క్లాస్ హోదా: అఫ్గానిస్థాన్ చిరకాల కోరిక ఫలించేనా?
హైదరాబాద్: అఫ్గానిస్థాన్‌కు ఫస్ట్‌క్లాస్ హోదా లభించింది. చాలా కాలంగా అఫ్గాన్ క్రికెట్ బోర్డు (ఎసిబి) టెస్టు హోదా కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేఫథ్యంలో దుబాయిలో సమావేశమైన ఐసీసీ ఎసిబి డిమాండ్‌పై చర్చ జరిగింది. దీంతో ఎసిబికి టెస్టు హోదాను ఇవ్వడానికి సభ్య దేశాలు అంగీకరించలేదు.
అయితే ఫస్ట్‌క్లాస్ హోదాను కల్పించాలని తీర్మానించాయి. తాజా తీర్మానంతో ఆప్ఘనిస్థాన్ జట్టుకు లిస్ట్ ఏ హోదా లభించింది. ఆప్ఘనిస్థాన్ దేశవాళీ మ్యాచ్‌లు ఆరంభంలో మూడు రోజులు జరిగేవి. 2014లో వీటిని ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల మాదిరిగా నాలుగు రోజులకు పెంచారు. ఈ మ్యాచ్‌ల్లో ఆమో, బాండ్ ఎ అమీర్, బూస్ట్, మిస్ ఐనక్, స్పీన్ ఘర్ జట్లు పోటీపడేవి.

రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో
2016లో కొత్తగా ఆరో జట్టుగా కాబూల్ గ్రీన్ టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ ఆరు జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడతాయి. ఒక్కో జట్టు మిగతా రెండు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి.

ఫస్ట్‌క్లాస్, లిస్ట్ ఏ హోదాలను కల్పించిన ఐసీసీ
ఐర్లాండ్‌లో మూడు జట్లు పోటీపడే దేశవాళీ టోర్నీలో నాలుగు రోజుల మ్యాచ్‌లను ప్రవేశపెట్టిన తర్వాత దానికి ఫస్ట్‌క్లాస్, లిస్ట్ ఏ హోదాలను ఐసీసీ కల్పించింది. ఇప్పుడు తాజాగా అఫ్గానిస్థాన్ కూడా అదే బాటలో హోదా కల్పించారు. ఐర్లాండ్‌లాగానే ఆప్ఘనిస్థాన్ కూడా ఫస్ట్‌క్లాస్, లిస్ట్ఏ హోదాను సంపాదించింది.

పది దేశాలకు టెస్టు హోదా
ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ పది దేశాలకు టెస్టు హోదా ఉంది. తాజాగా ఐర్లాండ్, అఫ్గానిస్తాన్ దేశవాళీ టోర్నీలకు ఫస్ట్‌క్లాస్ స్టేటస్ ఇవ్వడంతో, ఈ రెండు దేశాలకే త్వరలోనే టెస్టు హోదా వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇక, తమకు ఫస్ట్‌క్లాస్ హోదా లభించడం పట్ల ఎసిబి చీఫ్ ఎగ్జిక్యూటివ్ షఫీక్ స్టానిక్‌జయ్ హర్షం వ్యక్తం చేశాడు.

టెస్టు హోదా ఉన్న జట్లు:
1. ఆస్ట్రేలియా
2. ఇంగ్లాండ్
3. దక్షిణాఫ్రికా
4. వెస్టిండీస్
5. న్యూజిలాండ్
6. భారత్
7. పాకిస్తాన్
8. శ్రీలంక
9. జింబాబ్వే
10. బంగ్లాదేశ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications