Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ICUలో ప్రాణాలతో పోరాడుతున్న స్టార్ క్రికెటర్!

అఫ్గానిస్థాన్ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాజీ స్టార్ పేస శపూర్ జద్రాన్ ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. శపూర్ జద్రాన్ శరీరమంతా ఇన్ఫెక్షన్ వ్యాపించడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

హెచ్ఎల్‌హెచ్ అనే అరుదైన వ్యాధి
అఫ్గానిస్థాన్ క్రికెటర్ శపూర్ జద్రాన్ 'హెమొఫాగోసైటిక్ లింఫోహిస్టియోసైటోసిస్ HLH)' అనే అత్యంత అరుదైన, ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకు ప్రస్తుతం ఈ వ్యాధి నాలుగో దశలో ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. శపూర్ సోదరుడు ఘమాయ్ జద్రాన్ ఈ విషయంపై స్పందిస్తూ.. "ఇది చాలా తీవ్రమైన ఇన్ఫెక్షన్. ఇది ఆయన శరీరమంతా వ్యాపించడమే కాకుండా, మెదడుపై కూడా ప్రభావం చూపింది" అని ఆవేదన వ్యక్తం చేశాడు.

Afghanistan Cricketer Shapoor Zadran Battling for Life in ICU Diagnosis Reveals Stage 4 HLH

కోలుకుంటున్న దశలో డెంగ్యూ దాడి
గతేడాది అక్టోబర్ నెలలో శపూర్ జద్రాన్ తొలిసారిగా అనారోగ్యానికి గురయ్యాడు. మెరుగైన చికిత్స కోసం ఆయనను జనవరి 19న ఢిల్లీకి తరలించారు. మధ్యలో ఆయన ఆరోగ్యం కొంత మెరుగుపడినట్లు అనిపించినా.. దురదృష్టవశాత్తు ఇన్ఫెక్షన్ మళ్లీ తిరగబెట్టింది. దీనికి తోడు ఆయనకు డెంగ్యూ సోకడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ప్రస్తుతం ఆయన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడమే కాకుండా ఎర్ర రక్త కణాలు కూడా భారీగా పడిపోయాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

అండగా నిలిచిన రషీద్ ఖాన్, అఫ్గాన్ క్రికెట్ బోర్డు
శపూర్ జద్రాన్ ఎదుర్కొంటున్న ఈ క్లిష్ట సమయంలో అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్, అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు అండగా నిలిచాయి. రషీద్ ఖాన్ స్వయంగా పూనుకుని ఆయన వైద్య ఖర్చులకు సాయం చేయడమే కాకుండా.. ఢిల్లీలో చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. ఇటీవల ముంబై ఇండియన్స్ స్పిన్నర్ అల్లా ఘజన్‌పర్ కూడా ఆస్పత్రికి వెళ్లి శపూర్‌ను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ప్రార్థిస్తున్నారు.

క్రికెట్ ప్రస్థానం
శపూర్ జద్రాన్ 2009 నుంచి 2020 వరకు అఫ్గానిస్థాన్ తరఫున 44 వన్డేలు, 36 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 2015 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌పై అఫ్గానిస్థాన్ చారిత్రక విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. గతేడాది మాత్రమే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆయన.. అంతలోనే ఇలా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం క్రికెట్ ప్రపంచాన్ని కలచివేస్తోంది.

Story first published: Tuesday, April 21, 2026, 12:27 [IST]
Other articles published on Apr 21, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+