
హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్‌కు చెందిన 18 ఏళ్ల యువ క్రికెటర్ బహీర్ షా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డుని బద్దలు కొట్టాడు. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎదుగుతున్న పసికూన అఫ్గానిస్థాన్‌కు చెందిన బహీర్ షా... బ్రాడ్‌మన్‌ను రెండో స్థానానికి నెట్టేశాడు.
ఇంతకీ బహీర్ షా బద్దలు కొట్టిన ఆ రికార్డు ఏంటని అనుకుంటున్నారా? ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో వెయ్యి పరుగులు చేసిన వారిలో అత్యధిక సగటుని కలిగి ఉండటం. 121.77 సగటుతో బహీర్ షా అగ్రస్థానంలో నిలిచాడు. అంతకముందు 99.94 సగటుతో బ్రాడ్‌మన్ ఈ జాబితాలో అగ్రస్ధానంలో ఉన్నాడు.
అతడు తన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లోనే 256 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రంలోనే అత్యధిక పరుగులు చేసిన రెండో వ్యక్తిగా అరుదైన ఘనత సాధించాడు. దీంతో పాటు పాక్ మాజీ దిగ్గజం జావెద్ మియాందాద్ తర్వాత ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
బహీర్ షా తాను ఆడిన నాలుగు ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో (ఆరు ఇన్నింగ్స్‌లు) ద్వారా 831 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బిల్ ఫాన్స్‌ఫోర్డ్ రికార్డును సైతం అధిగమించాడు. ఆసీస్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డుని అధిగమించినందుకు గాను బహీర్ ఆనందం వ్కక్తం చేస్తున్నాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 'ఇదొక అద్భుతమైన క్షణం. రెండు రోజుల పాటు వికెట్‌ను కాపాడుకున్నా. టోర్నీకి ముందు ఫిట్ నెస్‌పై దృష్టి సారించా. కోచ్‌లు ఇప్పటికే ఏ విధంగా బ్యాటింగ్ చేయాలో కూడా చెప్పారు. నిజానికి ఆప్ఘన్ డొమిస్టిక్ క్రికెట్ తరుపున ఆడటం ఎంతో ఛాలెంజ్‌తో కూడుకున్నది' అని చెప్పుకొచ్చాడు.
అయితే తాను ఈ స్థాయికి రావడానికి తన కుటుంబ సభ్యులు, కోచ్, స్నేహితులే కారణమని చెప్పాడు. అంతేకాదు ప్రశాంతంగా ఆడటమే తన పరుగుల వరదకు కారణమని పేర్కొన్నాడు. తన అభిమాన దక్షిణాఫ్రికా క్రికెటర్ హషీమ్ ఆమ్లా మారిదిగా ప్రశాంతంగా ఉంటూ క్లిష్ట పరిస్థితుల్లో రాణించడమంటే చాలా ఇష్టమని అంటున్నాడు.
ప్రస్తుతం బహీర్ షా న్యూజిలాండ్‌లో జరిగే అండర్-19 వరల్డ్ కోసం అఫ్గాన్ జట్టు తరఫున ఆడుతున్నాడు. సెంట్రల్ డిస్ట్రిక్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో బహీర్ షా సెంచరీతో మెరిశాడు. కాగా, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వెయ్యి పరుగులు చేసిన వారిలో అత్యధిక సగటు ఉన్న క్రికెటర్లు వీరే
* బహీర్ షా (అఫ్గాన్)- 121.77 సగటు
* బ్రాడ్‌మన్ (ఆసీస్) - 95.14
* విజయ్ మర్చంట్ (భారత్)- 71.64
* జార్జ్ హెడ్లే (వెస్టిండీస్) - 69.86
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.