For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2021పై తాలిబన్ల జెండా

 Afghanistan cricket team will play in the T20 World Cup under Taliban flag
ICC ని బెదిరించి Taliban’s Flag తో T20 World Cup లో Afghanistan క్రికెటర్లు ఆడటానికి అనుమతి

దుబాయ్: ఇంకో నెల రోజులు కూడా లేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే.. ఇక టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ మొదలు కాబోతోంది. వచ్చేేనెల 17వ తేదీన తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్ బీలోని ఒమన్, పపువా న్యూగినియా జట్లు తలపడనున్నాయి. ఒమన్ మస్కట్‌లోని అల్ అమెరత్ క్రికెట్ స్టేడియంలో స్థానిక కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభమౌతుంది. అదే రోజు సాయంత్రం 7:30 గంటలకు రెండో మ్యాచ్- బంగ్లాదేశ్, స్కాట్లాండ్ మధ్య ఉంటుంది.

 17న తొలి మ్యాచ్..

17న తొలి మ్యాచ్..

ఫస్ట్ సెమీఫైనల్, సెకెండ్ సెమీఫైనల్, ఫైనల్.. ఈ మూడింటితో కలుపుకొని మొత్తం 45 మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించనున్నాయి. నవంబర్ 14వ తేదీన దుబాయ్‌ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. దీనికోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సన్నాహాలు పూర్తి చేస్తోంది. ఒమన్, ఎమిరేట్స్‌లల్లో క్రికెటర్లు బస చేయడానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రస్తుతం పర్యవేక్షిస్తోంది. కరోనా వైరస్ ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా ఈ మ్యాచ్‌లు కొనసాగనున్నాయి.

 క్రికెట్‌కు ఓకే..

క్రికెట్‌కు ఓకే..

కాగా- కరడుగట్టిన మత ఛాందసవాదులుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నవేళ.. తాలిబన్ల ప్రభుత్వాన్ని నెలకొల్పడానికి సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో- ఆ దేశ జాతీయ క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఆడుతుందా? లేదా? అనే అనుమానాలు మొదట్లో వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలకు సమాధానం ఇచ్చారు తాలిబన్లు. క్రికెట్ ఆడటానికి అడ్డు చెప్పబోమని స్పష్టం చేశారు.

 క్రికెట్ బోర్డులో హక్కానీ నెట్‌వర్క్

క్రికెట్ బోర్డులో హక్కానీ నెట్‌వర్క్

ఆప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డును తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదివరకు అష్రఫ్ ఘనీ ప్రభుత్వ హయాంలో క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసిన హమీద్ షిన్వారీని తొలగించారు. అతని స్థానంలో హక్కానీ నెట్‌వర్క్ కీలక నాయకుడు నసీబుల్లా హక్కానీని నియమించారు. అతని పర్యవేక్షణలోనే ఆ దేశ క్రికెట్ బోర్డు.. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ కోసం సన్నాహకాలు చేపట్టింది. క్రికెటర్లకు శిక్షణ సైతం ఇస్తోంది.

హక్కానీ మంత్రాంగం

హక్కానీ మంత్రాంగం

ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తాలిబన్ల జాతీయ పతాకాన్ని ధరించి క్రికెటర్లు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు నసీబుల్లా హక్కానీ. దీనికి మొదట్లో అంగీకరించలేదు ఐసీసీ. తాలిబన్ల సారథ్యంలోని ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని ఒకట్రెండు మినహా ప్రపంచ దేశాలేవీ గుర్తించట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తాలిబన్ల సారథ్యంలోని ఆప్ఘనిస్తాన్ జాతీయ పతాకంతో టోర్నమెంట్‌లో పాల్గొనడానికి తొలుత ఐసీసీ అంగీకరించలేదు.

 నిర్ణయాన్ని మార్చుకున్న ఐసీసీ..

నిర్ణయాన్ని మార్చుకున్న ఐసీసీ..

తాజాగా- ఐసీసీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. తాలిబన్ల జాతీయ జెండా కింద టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లలో ఆప్ఘనిస్తాన్ క్రికెటర్లు మ్యాచ్‌లను ఆడటానికి అంగీకరించింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆప్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఓ సమాచారాన్ని పంపించినట్లు తెలుస్తోంది. దీనితో తాలిబన్ల జాతీయ జెండా మొట్టమొదటి సారిగా ఓ అంతర్జాతీయ క్రీడా వేదిక మీద ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. అది టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌తోనే మొదలు కానుంది.

హక్కానీ పలుకుబడి..

హక్కానీ పలుకుబడి..

హక్కానీ నెట్‌వర్క్ పలుకుబడిని ఉపయోగించడం ద్వారా ఐసీసీని- తాలిబన్ల జాతీయ పతాకంతో తమ దేశ క్రికెటర్లు ఈ టోర్నమెంట్‌లో ఆడటానికి అనుమతి ఇచ్చేలా ఒత్తిడి తెచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ వంటి ఓ మెగా క్రికెట్ ఈవెంట్‌లో తాలిబన్ల జాతీయ పతాకంతో ఆడటం అంటే.. తాలిబన్ల ప్రభుత్వాన్ని పరోక్షంగా అంగీకరించినట్టయిందనే అభిప్రాయాలు లేకపోలేదు.

Story first published: Friday, September 24, 2021, 7:50 [IST]
Other articles published on Sep 24, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+