For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్తాన్ చేసిన నిర్వాకానికి..ఊహించని షాకిచ్చిన ఆఫ్ఘన్

పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చాయి. ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై భారీగా వైమానిక దాడులకు దిగింది పాకిస్తాన్. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే పాక్.. దాన్ని ఉల్లంఘించింది. భారీగా వైమానిక దాడులకు పాల్పడింది. డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న పక్టికా ప్రావిన్స్‌లో పలు ప్రాంతాలపై ఈ దాడులు సాగాయి. దీన్ని తాలిబాన్ అధికారికంగా ధృవీకరించింది కూడా.

అర్గూన్, బెర్మల్ జిల్లాల్లో పలు నివాసాలు ధ్వంసం అయ్యాయని ఆఫ్ఘన్ కు చెందిన టోలోన్యూస్ వెల్లడించింది. ఈ దాడుల్లో ప్రాణనష్టం పలువురు మరణించారు. ఈ నెల 11వ తేదీన ఆఫ్ఘన్ దళాలు పాకిస్తాన్ ఆర్మీ పోస్టులపై దాడి చేయడంతో కాన్ ఫ్లిక్ట్ మొదలైంది. ఇరువైపులా భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ దాడుల్లో ముగ్గురు స్థానిక క్రికెటర్లు సైతం దుర్మరణం పాలయ్యారు. పక్టికా ప్రావిన్స్ రాజధాని షరానాలో ఓ మ్యాచ్ ఆడి తిరిగి వస్తుండగా.. పాక్ జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు సహా పలువురు మరణించారు.

Afghanistan Cricket Board withdraw from Pakistan tri-series

ఈ పరిణామాల నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకుంది. ఆ దేశంలో జరగాల్సిన ముక్కోణపు టీ20 సిరీస్ నుండి తప్పుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఉర్గున్ జిల్లాలో జరిగిన సరిహద్దు దాడిలో ముగ్గురు స్థానిక క్రికెటర్లు మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

పాకిస్తాన్- ఆఫ్ఘనిస్తాన్- శ్రీలంక జట్ల మధ్య నవంబర్ 17 నుండి 29 వరకు ఈ ముక్కోణపు సిరీస్ జరగాల్సి ఉంది. రావల్పిండి, లాహోర్‌.. దీనికి వేదిక. కిందటి నెలలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ సిరీస్ ను ప్రకటించింది. తాజాగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ ట్రై- సిరీస్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వైదొలగింది. ఈ విషయాన్ని అధికారింగా వెల్లడించింది.

ఈ ఘటన ఆఫ్ఘనిస్తాన్ క్రీడారంగానికి, అథ్లెట్లు, క్రికెటర్ల కుటుంబాలకు తీరని లోటుగా భావిస్తోన్నామని తెలిపింది. ఈ దాడిని దురదృష్టకర ఘటనగా అభివర్ణించింది. బాధిత కుటుంబాలకు సంతాప సూచకంగా పాకిస్తాన్ లో జరగాల్సిన త్రైపాక్షిక టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఈ పరిణామంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంకా స్పందించలేదు. దీన్ని రద్దు చేస్తుందా? లేక ద్వైపాక్షిక సిరీస్ గా కొనసాగిస్తుందా అనేది తేలాల్సి ఉంది.

Story first published: Saturday, October 18, 2025, 7:36 [IST]
Other articles published on Oct 18, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+