Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆప్ఘన్ బోర్డు కీలక నిర్ణయం: రషీద్‌ ఖాన్‌కు డిమోషన్, కెప్టెన్‌గా అస్గర్

Afghanistan Cricket Board reappoints Asghar Afghan as captain across all formats; Rashid Khan to be his deputy

హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్ మాజీ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ మూడు ఫార్మాట్లలో తిరిగి ఆ జట్టు కెప్టెన్‌గా నియమిస్తూ ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌కు సరిగ్గా మూడు నెలల ముందు అతడిని కెప్టెన్సీ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే.

వరల్డ్‌కప్‌కు అతడి స్థానంలో గుల్బాదిన్ నాబ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. గుల్బాదిన్ సైతం అస్గర్ అఫ్గానే తన కెప్టెనే అంటూ స్వయంగా పేర్కొన్నాడు. ఆప్ఘన్ సీనియర్ ఆటగాళ్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీలు గుల్బాదిన్ నియామకంపై తమ అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు.

గుల్బాదిన్ నాయకత్వంలో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆప్ఘనిస్థాన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో గుల్బాదిన్ కెప్టెన్సీ నుంచి తప్పించింది. గుల్బాదిన్ నాయకత్వంలో ఆప్ఘనిస్థాన్ జ్టటు మొత్తం 12 వన్డే మ్యాచ్‌లాడగా ఇందులో రెండు మ్యాచ్‌ల్లో ఆప్ఘన్ విజయం సాధించింది.

10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. వరల్డ్‌కప్ అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో అస్గర్ ఆప్ఘన్ స్థానంలో స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను నియమించింది. అయితే, ఏమైందో ఏమో తెలియదు గానీ తిరిగి అస్గర్ ఆప్ఘన్‌కే ఆప్ఘన్ క్రికెట్ బోర్డు కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పింది. ఇకపై రషీద్ ఖాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.

అంతకముందు రషీద్ ఖాన్ ఆప్ఘన్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తుండగా, రెహ్మద్ షా టెస్టు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, ఇప్పుడు ఆప్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు మూడు ఫార్మాట్లకు అస్గర్ ఆప్ఘన్‌నే కెప్టెన్‌గా నియమించడం విశేషం. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ నిరాశపరిచింది. తొమ్మిది లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది.

Story first published: Wednesday, December 11, 2019, 18:07 [IST]
Other articles published on Dec 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+