న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాదేశ్‌తో ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ఆఫ్ఘాన్‌కు భారీ ఎదురుదెబ్బ

Afghanistan captain Rashid Khan doubt for T20I tri series final match

చిట్టగాంగ్: ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు ముక్కోణపు టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్-ఆఫ్ఘనిస్థాన్-జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఫైనల్‌కు చేరిన ఆఫ్ఘనిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఢాకాలో బంగ్లాదేశ్‌తో ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. మంచి ప్రదర్శన చేస్తున్న ఆఫ్ఘాన్ కెప్టెన్, స్టార్ స్పిన్నర్ రషీద్‌ ఖాన్ ఆడేలా కనిపించడం లేదు. రషీద్‌ఖాన్ గాయంపై జట్టు యాజమాన్యం ఆందోళనకు గురవుతోంది. ఫైనల్‌ మ్యాచ్ వరకు అతడికి గాయం తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సమాచారం.

వైరల్ ఫొటో.. బికినీలో పిచ్చెక్కిస్తున్న ధోనీ మాజీ గర్ల్ ఫ్రెండ్వైరల్ ఫొటో.. బికినీలో పిచ్చెక్కిస్తున్న ధోనీ మాజీ గర్ల్ ఫ్రెండ్

బంగ్లాదేశ్‌తో గత శనివారం (సెప్టెంబర్ 21) జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ గాయపడ్డాడు. బంగ్లా లక్ష్య చేధనలో భాగంలో ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో ఫీల్డింగ్ చేస్తున్న రషీద్ గాయపడ్డాడు. అయితే అఫ్ఘనిస్తాన్ అప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించడంతో ఆఫ్ఘాన్‌ ఆందోళన చెందలేదు. చికిత్స చేసినా గాయంలో మార్పు లేకపోవడంతో కీలకమైన ఫైనల్‌కు అతడు అందుబాటులో ఉండడం అనుమానంగానే ఉంది. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్‌పై కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచిన జింబాబ్వే టోర్నీ నుంచి వెనుదిరిగింది.

రషీద్‌కు అయిన గాయంపై ఆఫ్ఘాన్ జట్టు మేనేజర్ నజీం జర్ అబ్దుర్ రహీం జై ఆదివారం మాట్లాడుతూ... 'ఫైనల్‌కు మరో రెండు రోజుల సమయం ఉంది. అతడు ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడా? ఉండడా? అనేది ఇప్పుడే చెప్పలేం. రషీద్‌కు అయిన గాయం చిన్నదే. రషీద్‌ జట్టు కెప్టెన్ కాబట్టి ఏ విషయమూ త్వరలో చెబుతాం' అని పేర్కొన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ తన పేరిట టీ20ల్లో రికార్డుని నెలకొల్పాడు జింబాబ్వే జట్టు కెప్టెన్ హామిల్టన్ మసకద్జ. శుక్రవారం ఆప్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మసకద్జ 42 బంతుల్లో 71 పరుగులు చేయడంతో పాటు తన ఖాతాలో అరుదైన రికార్డుని నెలకొల్పాడు. టీ20 క్రికెట్‌లో ఓ ఆటగాడి ఫేర్‌వెల్ మ్యాచ్‌‌లో హామిల్టన్ మసకద్జ సాధించిన 71 పరుగులకే ఇప్పటివరకు అత్యధికం కావడం విశేషం. అంతేకాదు ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో టీ20ల్లో ఆప్ఘన్ 12 వరుస విజయాల ఆల్‌ టైమ్‌ రికార్డుకు బ్రేక్ పడింది.

Story first published: Monday, September 23, 2019, 17:06 [IST]
Other articles published on Sep 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X