For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'మీరే మాకు దిక్కు.. దయచేసి మమ్మల్ని కాపాడండి!' - అప్ఘాన్ కెప్టెన్

'మీరే మాకు దిక్కు.. దయచేసి మమ్మల్ని కాపాడండి!' అని అంటున్నాడు అప్ఘానిస్థాన్ కెప్టెన్ షాహిది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్ లో వర్షం కారణంగా అప్ఘానిస్థాన్ సెమీఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. ఈ నేపథ్యంలో అతడీ వ్యాఖ్యలు చేశాడు. తాజా మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు సౌతాఫ్రికాపై గెలవాలని ఆకాంక్షించాడు.

ఈ రోజు కలిసి రాలేదు..
"దురదృష్టవశాత్తు ఫలితం రాకుండానే మ్యాచ్ రద్దు అయిపోయింది. ఇది మంచి మ్యాచ్. మేం 300కు పైగా స్కోర్ చేస్తామని ఆశించాను. కానీ వాళ్లు మిడిల్ ఓవర్లలో మంచిగా బంతులు సంధించారు. 270 కూడా మంచి స్కోరే. కానీ మేము బంతితో మంచిగా ఆరంభించలేదు. వాళ్లకు ఎక్కువ హిట్టింగ్ ఆప్షన్స్ ఇచ్చాం. ఈ మ్యాచ్ లో మేం చేసిన తప్పిదాలను సరిచేసుకుని నేర్చుకుంటాం. అటల్ బాగా ఆడాడు. తొలి రెండు మ్యాచుల్లో మేం ఆశించినంతగా అతడు ప్రదర్శన చేయలేదు. కానీ కమ్ బ్యాక్ మంచిగా ఇచ్చాడు. ఇది తొలి ఐసీసీ ఈవెంట్ అతడికిది. ఒత్తిడిలోనూ బాగా ఆడాడు. ఒమర్జాయ్ టాప్ క్లాస్ ప్లేయర్. ఎప్పుడు జట్టు కోసం ఆడతాడు. అందుకే అతడికి వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ వచ్చింది.

Afghanistan Captain hopes england to win on SA to qualify in Champions Trophy 2025 Semifinal race

ఇంగ్లాండ్ పై మ్యాచ్ లో అతడు కీలకంగా వ్యవహరించడంతో పాటు ఇవాళ్ల కూడా ఒత్తిడిలోనూ సానుకూల దృక్పథతో ఆడాడు. నాకు తెలిసి ఈ రోజు బ్యాటర్ గా నాకు కలిసి రాలేదు. నేను ఎక్కడ తప్పిదం చేశానో తర్వాత కోచ్ తో మాట్లాడతాను. స్లో ఇన్నింగ్స్ స్ట్రైక్ రేట్ ఆడాను. దీని నుంచి నేర్చుకుంటాను. మాకు ఇంకా అవకాశాలు మిగిలి ఉన్నాయని ఆశిస్తున్నాను. చెప్పలేం ఏదైనా జరగొచ్చు. ఇంగ్లాండ్ భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను." అని షాహిది చెప్పుకొచ్చాడు.

ఇంగ్లాండ్ పైనే ఆశలన్నీ...
వర్షం కారణంగా ఆసీస్ - అప్ఘాన్ మ్యాచ్ రద్దైంది. ఫలితంగా అఫ్ఘాన్ కు , ఆసీస్ కు చెరో పాయింట్ లభించింది. ఆస్ట్రేలియా నాలుగు పాయింట్లతో సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకోగా.. మూడు పాయింట్లతో అప్ఘానిస్థాన్ టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. కానీ నేడు (మార్చి 1) సౌతాఫ్రికాతో జరగబోయే మ్యాచ్ లో భారీ తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించి.. సౌతాఫ్రికా ఓడిపోతే నెట్ రన్ రేట్ కారణంగా అప్ఘాన్ సెమీస్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అది కూడా కచ్చితంగా భారీ తేడాతోనే ఓడిపోవాలి. అందుకే ఇంగ్లాండ్ భారీ విజయం సాధించాలని అప్ఘాన్ కెప్టెన్ షాహిది ఆశించాడు.

Story first published: Saturday, March 1, 2025, 7:25 [IST]
Other articles published on Mar 1, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+