
హైదరాబాద్: టీమిండియాతో చారిత్రత్మాక టెస్టుకు అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు మంగళవారం 16 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఇప్పటికే 15 మందితో కూడిన తుది జట్టును భారత్ కొద్ది రోజుల ముందే విడుదల చేసింది. కాగా, బెంగళూరు వేదికగా ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ ఈనెల 14న ఆరంభంకానుంది. అఫ్గాన్ కెప్టెన్‌గా అస్గార్ స్టానిక్‌జాయ్‌ను నియమించింది. ఈ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమైన నేపథ్యంలో ఆజింక్య రహానెకు భారత జట్టు నాయకత్వ బాధ్యలు అప్పగించారు.
అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులో తలపడే టీమిండియా:
1. అజింక్య రహానే(కెప్టెన్)
2. శిఖర్ ధావన్
3. మురళీ విజయ్
4. కేఎల్ రాహుల్
5. చతేశ్వర్ పుజారాః
6. కరుణ్ నాయర్
7. సాహా (వికెట్ కీపర్)
8. రవిచంద్రన్ అశ్విన్,
9. రవీంద్ర జడేజా
10. కుల్దీప్ యాదవ్
11. ఉమేశ్ యాదవ్
12. మహ్మద్ షమీ
13. హార్దిక్ పాండ్య
14. ఇషాంత్ శర్మ
15. శార్ధూల్ ఠాకూర్.
అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులో భారత్‌తో తలపడనున్న అఫ్గాన్ జట్టు:
1. అస్గర్ స్టానిక్‌జాల్
2. మొహమ్మద్ షాజాద్
3. జావేద్ అహ్మది
4. రహ్మ త్ సింగ్
5. ఇహ్‌సానుల్పాహ జనత్
6. నజీర్మ జమాల్
7. హస్మతుల్లా షాహిదీ
8. అఫ్సర్ జజాయ్
9. మొహమ్మద్ నబీ
10. రషీద్ ఖాన్
11. జహీర్ ఖాన్
12. హమ్జా హోటక్
13. సయ్యద్ అహ్మద్ షిర్జాద్
14. యామిన్ అహ్మద్‌జై
15. వఫాదర్
16. ముజీబ్ ఉర్ రహ్మన్
సంచలన విజయాలు సాధిస్తూ, అంచనాలు మించి రాణిస్తున్న అఫ్గనిస్థాన్, ఐర్లాండ్ జట్లకు ఘనమైన టెస్టు హోదా కల్పిస్తూ, లండన్ లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఆఫ్గన్, ఐర్లాండ్ లకు పూర్తి సభ్యత్వాన్నీ ఇస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. ఈ రెండు జట్ల చేరికతో టెస్టు మ్యాచ్ లు ఆడే దేశాల సంఖ్య 12కు పెరిగింది. ఐసీసీ ఏజీఎంలో రెండు దేశాలకూ టెస్ట్ హోదాపై సభ్య దేశాలన్నీ ఏకగ్రీవ ఆమోదం పలకడం గమనార్హం. ఏ దేశమూ అభ్యంతరాలను వ్యక్తం చేయలేదని ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, ఐర్లాండ్ కు 2005లో ఆఫ్గనిస్థాన్ కు 2009లో వన్డే హోదా దక్కిందన్న సంగతి విదితమే.