AFG vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఆల్‌రౌండర్ ఒమర్జాయ్ భారీ రికార్డు
AFG vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ విజయానికి ఇబ్రహీం జద్రాన్ రికార్డు సెంచరీ ప్రధాన కారణమైనప్పటికీ.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఆల్ రౌండర్‌గా అస్మతుల్లా ఒమర్జాయ్ అసాధారణ ప్రదర్శన ఆఫ్ఘన్ జట్టు విజయానికి మూలస్తంభంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో ఒమర్జాయ్ 31 బంతుల్లో 41 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో కూడా అద్భుతంగా రాణించాడు. ఒమర్జాయ్ తన బౌలింగ్‌లో 59 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
చివరి ఓవర్లలో జో రూట్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ వికెట్లను వరుసగా పడగొట్టాడు. అదే ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో మ్యాచ్ గెలవడానికి సహాయపడింది. దీంతో అద్భుతమైన ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డును ఒమర్జాయ్ సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఒకే మ్యాచ్ లో 40 కంటే ఎక్కువ పరుగులు చేసి, ఐదు వికెట్లు తీసిన ఏకైక ఆల్‌రౌండర్‌గా అస్మతుల్లా ఒమర్జాయ్ నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఐదు వికెట్లు తీసిన ఐదో బౌలర్ గా కూడా ఒమర్జాయ్ నిలిచాడు. అంతకు ముందు జాక్వెస్ కల్లిస్, మకాయా నితిని, జాకబ్ ఓరం, గ్లెన్ మెక్ గ్రాత్ 5 వికెట్లు పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుతంగా రాణించింది. ఇబ్రహీం జద్రాన్ ఓపెనర్‌గా వచ్చి వికెట్లు పడిపోతున్నప్పటికీ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టు విజయం సాధించేందుకు కృషి చేశాడు. కెప్టెన్ అస్మతుల్లా షాహిది 40 పరుగులు, అస్మతుల్లా ఒమర్జాయ్ 31 బంతుల్లో 41 పరుగులు, మహ్మద్ నబీ 24 బంతుల్లో 40 పరుగులు చేశారు. దీంతో ఆఫ్ఘన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేసింది.
అనంతరం ఇంగ్లాండ్ ఛేదనలో.. జో రూట్ అద్భుతంగా ఆడి 120 పరుగులు చేశాడు. బెన్ డకెట్ 38, జోస్ బట్లర్ 28 పరుగులు చేశారు. 46వ ఓవర్ లో అస్మతుల్లా ఒమర్జాయ్ జో రూట్ వికెట్ పడగొట్టడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. అనంతరం జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ వికెట్లు వరుసగా పడిపోయాయి. అంతకు ముందు ఒమర్జాయ్.. ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ వికెట్లను పడగొట్టాడు. చివరి ఓవర్‌లో జో రూట్, ఆదిల్ రషీద్ వికెట్లను కూడా ఒమర్జాయ్ పడగొట్టాడు. ఈ క్రమంలో ఒమర్జాయ్ 41 పరుగులు చేసి ఐదు వికెట్లను పడగొట్టడం ద్వారా రికార్డు సృష్టించాడు.
🚨 ONE OF THE GREATEST MOMENT IN AFGHANISTAN CRICKET HISTORY 🚨 pic.twitter.com/XuN1ZTDW1O
— Johns. (@CricCrazyJohns) February 26, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications