Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అద్భుతం చేసిన ఆప్ఘన్: తొలిసారి అండర్‌-19 ఆసియాకప్‌ కైవసం

Afghan Youth Team Beats Pakistan to Win Asian Cricket Championship

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్ఘానిస్థాన్ యువ జట్టు సంచలనం సృష్టించింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ అండర్‌-19 ఆసియాకప్‌ వన్డే టోర్నీ విజేతగా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తమకంటే ఎంతో బలమైన పాకిస్థాన్‌పై ఏకంగా 185 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

టోర్నీ ఆరంభం నుంచే సంచలన విజయాలను నమోదు చేసిన ఆప్ఘనిస్థాన్ ఫైనల్లో కూడా అద్భుత ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఆప్ఘనిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసింది.ఇక్రామ్‌ ఫైజీ (107) సెంచరీతో చెలరేగగా, రహ్మాన్‌ గుల్‌ 40 పరుగులతో రాణించారు.

పాకిస్థాన్ బౌలర్లలో మూసా 3, షాహిన్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ ముజీబ్‌ జర్దాన్‌ (5/13) ధాటికి ఏదశలోనూ కోలేకపోయింది. ఆ జట్టు 22.1 ఓవర్లలో కేవలం 63 పరుగులకే కుప్పకూలింది. పాక్‌ జట్టులో ఎనిమిదిమంది కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు.

తాహ (19) టాప్‌స్కోరర్‌ కాగా, అఫ్ఘాన్‌ బౌలర్లలో ముజీబ్‌ 5, ఖైస్‌ అహ్మద్‌ 3 వికెట్లు పడగొట్టారు. ఇదిలా ఉంటే గత మూడు టోర్నీల్లో అఫ్ఘనిస్థాన్ సెమీస్‌లోనే వెనుదిరిగడం విశేషం. ఈ టోర్నీలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత్‌ అనూహ్యంగా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది.

Story first published: Monday, November 20, 2017, 9:35 [IST]
Other articles published on Nov 20, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+