బీబీఎల్: తొలి ఆప్ఘన్ క్రికెటర్‌గా రషీద్ ఖాన్ సంచలనం
హైదరాబాద్: అప్ఘనిస్థాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ మరో సంచలనం సృష్టించాడు. ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టు తరుపున ఈ యువ స్పిన్నర్ బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు రషీద్ ఖాన్ ఒప్పందం చేసుకున్న విషయాన్ని అడిలైడ్ స్ట్రైకర్స్ గురువారం వెల్లడించింది.
దీంతో బిగ్ బాష్ లీగ్‌లో ఆడనున్న తొలి అప్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ గుర్తింపు పొందాడు. ఈ ఏడాది ఐపీఎల్ పదో సీజన్‌లో సన్‌రైజర్స్ తరుపున అద్బుత ప్రదర్శన కనబర్చిన 18 ఏళ్ల ఈ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.

కరేబియన్ లీగ్‌లో తొలి హ్యాట్రిక్ తీసిన బౌలర్
ఐపీఎల్ అనంతరం కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో కూడా రషీద్ ఖాన్ సత్తా చాటుతున్నాడు. అమెజాన్ వారియర్స్ తరుపున ఆడిన రషీద్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. కరేబియన్ టీ20లీగ్‌లో తొలి హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు.

బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రాంఛైజీ ఒప్పందం
దీంతో బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రాంఛైజీ రషీద్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.4 కోట్లకు అతడిని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అడిలైడ్ స్ట్రైకర్స్ ఎంత మొత్తానికి ఒప్పందం చేసుకుందో ఇంకా తెలియరాలేదు.

సంతోషం వ్యక్తం చేసిన రషీద్
కాగా, బీబీఎల్‌లో స్ట్రైకర్స్ తరఫున ఆడే అవకాశం రావడంతో రషీద్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘బిగ్‌బాష్ లీగ్‌లో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం, ఈ లీగ్‌లో తొలి అఫ్గాన్‌గా బరిలోకి దిగడం నాలో సంతోషాన్ని ఇచ్చింది' అని రషీద్ తెలిపాడు.

తమ జట్టుకు లాభిస్తుందన్న స్ట్రైకర్స్ కోచ్
ఇక, రషీద్ రాక తమ జట్టుకు లాభిస్తుందని స్ట్రైకర్స్ కోచ్ జాసన్ గిలెస్పీ అన్నాడు. అతని బౌలింగ్‌లో ఉన్న ప్రత్యేకతే అతన్ని గొప్ప టీ20 క్రీడాకారుడిని చేసిందని కొడియాడారు. ఆప్ఘన్ తరుపున 29 వన్డేలు ఆడిన రషీద్ 63 వికెట్లు తీశాడు. వెస్టిండీస్ పర్యటనలో ప్రపంచ నాలుగో అత్యుత్తమ బౌలింగ్(7-18) గణంకాలు నమోదు చేశాడు. డిసెంబర్ 20 నుంచి బీబీఎల్ సీజన్ ప్రారంభం అవుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications