Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాక్ అండ్ బ్యాక్ వాయింపుడేనా? ఆఫ్ఘ‌న్ త‌దుప‌రి మ్యాచ్ టీమిండియాతో!

Afghan may face another backlash as india for its next match in World cup 2019

లండ‌న్‌: ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు ఇచ్చిన హైఓల్టేజీ షాక్‌లో కూరుకుపోయింది ఆఫ్ఘ‌నిస్తాన్ టీమ్‌. జ‌ట్టులో నిరాశ‌, నిస్పృహ‌లు అల‌ముకున్నాయి. ఆ జ‌ట్టు బ్యాటింగ్ చేసిన తీరు దీన్ని స్ప‌ష్టం చేసింది. ఆప్ఘ‌నిస్తాన్ టీమ్‌ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉత్సాహ‌భ‌రిత వాతావ‌ర‌ణం లేదు. ఇంగ్లండ్‌పై మ్యాచ్ గెలవాల‌నే ఆశ‌లు లేన‌ప్ప‌టికీ..బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లో చురుగ్గా రాణించాల‌నే వారి వ్యూహం త‌ల‌కిందులైంది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ల ధాటికి వారి ప్ర‌ణాళిక మొత్తం ప‌ల్టీ కొట్టింది. త‌మ బౌలింగ్ వ‌న‌రుల‌న్నింటినీ ప్ర‌యోగించినా, చిట్కాల‌న్నీ అమ‌లు చేసినా క‌నీసం క‌ట్ట‌డి కూడా చేయ‌లేక‌పోయింది ఆఫ్ఘ‌న్‌.

 టీమిండియా రూపంలో మ‌రో గండం!

టీమిండియా రూపంలో మ‌రో గండం!

ప్ర‌స్తుతం వారి ప‌రిస్థితి ఇలా ఉంటే- టీమిండియా రూపంలో మ‌రో గండాన్ని ఎదుర్కొంటోంది ఆప్ఘ‌న్ క్రికెట్ జ‌ట్టు. ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న త‌దుప‌రి మ్యాచ్‌లో అత్యంత బ‌లంగా ఉన్న మ‌రో మేటి జ‌ట్టు భార‌త్‌ను ఢీ కొట్ట‌బోతోంది. ఈ రెండు జ‌ట్ల మ‌ధ్య శ‌నివారం మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఇంగ్లండ్ హ్యాంప్‌షైర్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు భార‌త్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ఆరంభం అవుతుంది. వ‌ర్షం వ‌ల్ల న్యూజీలాండ్‌తో జ‌రగాల్సిన మ్యాచ్ ర‌ద్దు కావ‌డం మిన‌హా, ఆడిన అన్ని పోటీల్లో టీమిండియా అసాధార‌ణంగా రాణించింది.

ఆఫ్ఘ‌న్‌పై చెల‌రేగుతారా?

ఆఫ్ఘ‌న్‌పై చెల‌రేగుతారా?

ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌కు బ‌ల‌మైన పోటీదారులుగా భావించిన‌- ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ల‌ను మ‌ట్టి క‌రిపించింది. ఏక‌చ్ఛ‌త్రాధిప‌త్యంతో ఫైన‌ల్ దిశ‌గా దూసుకెళ్తోంది. ఈ క్ర‌మంలో- ఎదుర‌య్యే ఆఫ్ఘ‌నిస్తాన్ వంటి చిన్న జ‌ట్ల‌ను భార‌త్ ఎలా ఎదుర్కొంటుంద‌నేది ఆస‌క్తిక‌ర‌మే. ఇప్ప‌టికే- ఆప్ఘ‌నిస్తాన్‌పై 397 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించిన ఇంగ్లండ్ టీమ్‌.. ఓ బెంచ్‌మార్క్‌ను న‌మోదు చేసింది. ఇంగ్లండ్ కంటే బల‌మైన బ్యాటింగ్‌, బౌలింగ్ వ‌న‌రులు ఉన్న భార‌త్ కూడా ఆ బెంచ్‌మార్క్‌ను అందుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేసిందంటే మాత్రం ఆఫ్ఘ‌నిస్తాన్ బౌల‌ర్లు మ‌రో ఊచ‌కోత‌ను ఎదుర్కొన‌క త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఐపీఎల్ ద్వారా ర‌షీద్ ఖాన్ బౌలింగ్ చిర ప‌రిచిత‌మే!

ఐపీఎల్ ద్వారా ర‌షీద్ ఖాన్ బౌలింగ్ చిర ప‌రిచిత‌మే!

నిజానికి- ర‌షీద్ ఖాన్ బౌలింగ్ ఎలాంటిద‌నేది టీమిండియా బ్యాట్స్‌మెన్ల‌కు బాగా తెలుసు. ఐపీఎల్‌లో హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు ప్ర‌ధాన బౌల‌ర్‌గా ఉన్న ర‌షీద్ ఖాన్‌ను ఇదివ‌ర‌కే టీమిండియాలోని బ్యాట్స్‌మెన్లంద‌రూ ఎదుర్కొన్నారు. అత‌ని బౌలింగ్ శైలి ఎలా ఉంటుంద‌నేది తెలుసు. ఎలాంటి చిట్కాల‌కు ప్ర‌యోగిస్తాడ‌నేదీ చిర ప‌రిచిత‌మే. ముంబై ఇండియ‌న్స్ కేప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌, చెన్నై సూప‌ర్‌కింగ్స్ స్కిప్ప‌ర్‌గా మ‌హేంద్ర సింగ్ ధోనీ, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు సార‌థ్యం వ‌హిస్తోన్న విరాట్ కోహ్లీకి, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జ‌ట్టు ఓపెన‌ర్‌గా కేఎల్ రాహుల్‌.. ఇలా టీమిండియాలోని దాదాపు బ్యాట్స్‌మెన్లంద‌రూ ర‌షీద్ ఖాన్‌, న‌బీ బౌలింగ్‌ను బాగా అధ్య‌య‌నం చేసిన వారే.

మ‌రో బాదుడు త‌ప్ప‌దా?

మ‌రో బాదుడు త‌ప్ప‌దా?

ఈ నేప‌థ్యంలో ర‌షీద్ ఖాన్‌, న‌బీ స‌హా ఆ జ‌ట్టు బౌల‌ర్లంద‌రూ మ‌రో బాదుడును ఎదుర్కొన‌డానికి సిద్ధ‌ప‌డాల్సి ఉంటుంద‌ని అంటున్నారు క్రికెట్ పండితులు. ఇంగ్లండ్ చేతిలో చావుదెబ్బ‌లు తిన్న ఆప్ఘ‌నిస్తాన్ బౌల‌ర్లు.. టీమిండియాతో మ్యాచ్‌సంద‌ర్భంగా త‌మ వైఖ‌రిని, శైలిని, వ్యూహాల‌ను మార్చుకుంటారా? లేదా? అనేది ఆస‌క్తిక‌ర‌మైన అంశం. ఇంగ్లండ్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా ఎదురైన దారుణ ప‌రాజ‌యం నుంచి తేరుకుని త‌మ త‌దుప‌రి మ్యాచ్‌లో ప్ర‌త్య‌ర్థిని ఎలా క‌ట్ట‌డి చేసే దిశ‌గా అవ‌స‌ర‌మైన క‌స‌ర‌త్తు చేపడుతున్నారు. దీనికోసం నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు ఆ జ‌ట్టు బౌల‌ర్లు.

Story first published: Wednesday, June 19, 2019, 12:15 [IST]
Other articles published on Jun 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+