Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pakistan vs Afghanistan: ఫ్యాన్స్ వీరంగం: పాక్ అభిమానులపై దాడులు

Afghan Fans destroying stadium property and chairs after loosing the match against Pakistan

షార్జా: ఆసియా కప్ 2022 సూపర్ 4లో భాగంగా షార్జా స్టేడియంలో బుధవారం రాత్రి పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్- అసలు సిసలు మజా ఇచ్చింది. ఫైనల్స్‌కు చేరుకోవాలంటే గెలిచిన తీరాల్సిన ఈ లోస్కోర్ మ్యాచ్‌లో రెండు జట్లు హోరాహోరిగా పోరాడాయి. చివరి బంతి వరకూ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా కనిపించింది. చివరి ఆరు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన దశలో పాక్ బ్యాటర్ నసీం షా సిక్సర్ల సిక్సర్ల మోత మోగించాడు. తొలి రెండు బంతుల్లోనే మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమైంది. ఫైనల్స్‌కు చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్ బౌలర్ల ధాటికి ఎవ్వరూ కుదురుగా క్రీజ్‌లో నిల్చోలేకపోయారు. టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇబ్రహం జడ్రాన్ ఒక్కడే టాప్ స్కోరర్ 37 బంతుల్లో రెండు సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. ఓపెనర్ హజ్రతుల్లా జజయ్-21, రహ్మనుల్లా గుర్బాజ్-17, కరీం జనత్-15, నజీబుల్లా జడ్రాన్-10, కేప్టెన్ మహ్మద్ నబీ-0, అజ్ముతుల్లా ఒమర్‌జయ్-10, రషీద్ ఖాన్-18 పరుగులు చేశారు.

Afghan Fans destroying stadium property and chairs after loosing the match against Pakistan

గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయింది ఆఫ్ఘనిస్తాన్. చివరి ఓవర్‌లో 11 పరుగులను కాపాడుకోలేకపోయింది. స్టార్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ పరుగులను నియంత్రించలేకపోయాడు. బ్యాటర్లను క్రీజ్‌లో కదలనివ్వని స్థితిలో ఉంచలేకపోయాడు. తొలి రెండు బంతుల్లోనే రెండు భారీ సిక్సర్లు బాదాడు. బంతిని మెరుపువేగంతో ఫెన్సింగ్ దాటించగలిగాడు టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ నసీం షా. ఈ రెండు సిక్సర్లు- అతణ్ని బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపునిచ్చాయి.

ఈ మ్యాచ్ గెలిచివుంటే ఆఫ్ఘనిస్తాన్ ఫైనల్స్ చేరి ఉండేది. ఆసియా కప్ 2022లో అడుగు పెట్టిన మూడో సంవత్సరంలోనే ఫైనల్స్ చేరిన ఘనతను సాధించి ఉండేది. ఆ అవకాశం దక్కలేదు ఆఫ్ఘనిస్తాన్‌కు. నసీం షా సైంధవుడిలా అడ్డుపడ్డాడు. ఈ పరిణామం ఆఫ్ఘనిస్తాన్ అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలను కలిగించింది.

చివరి వరకు తమ ఆధీనంలో ఉన్న మ్యాచ్- ఒక్కసారిగా ప్రత్యర్థి వైపు మళ్లడాన్ని జీర్ణించుకోలేకపోయారు. విధ్వంసానికి పాల్పడ్డారు. షార్జా స్టేడియంలో కుర్చీలను విరగ్గొట్టారు. వాటి ముక్కలను గాల్లోకి ఎగరేశారు. అక్కడితో ఆగలేదు- పాకిస్తాన్ ఫ్యాన్స్‌పైనా దాడులకు దిగారు. విరిగిన కుర్చీలను పాకిస్తాన్ ఫ్యాన్స్‌పై విసిరారు. అవి తగిలి కొందరికి తేలికపాటి గాయాలయ్యాయి. ఒకదశలో ఈ రెండు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ సైత తలెత్తింది. గ్రౌండ్ స్టాఫ్, స్టేడియం భద్రత సిబ్బంది జోక్యం చేసుకోవడంతో వెనక్కి తగ్గారు.

Story first published: Thursday, September 8, 2022, 10:27 [IST]
Other articles published on Sep 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+