Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్తాన్ దాడుల్లో మరణించిన ఆఫ్ఘన్ క్రికెటర్లు ఎవరు?

Pakistan-Afghanistan War: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు ఏ మాత్రం సరిగా లేవు. రెండ్రోజుల పోరాటం తర్వాత కాల్పుల విరమణ జరిగింది. అయితే పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ ఆఫ్ఘనిస్తాన్‌పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు మరణించారు. అయితే ఈ ఆటగాళ్ల గురించి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ACB) స్వయంగా పోస్ట్ ద్వారా సమాచారాన్ని అందించింది.

మరణించిన ఆ ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లు ఎవరు?
పాకిస్తాన్ వైమానిక దాడుల్లో యువ క్రికెటర్లు కబీర్ ఆఘా, సిబ్‌గతుల్లా, హారూన్ మరణించారని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ ముగ్గురూ ఆఫ్ఘనిస్తాన్ యువ క్రికెటర్లు కావడం గమనార్హం. స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ఈ ఆటగాళ్లు మొదట పక్టికా ప్రావిన్స్ రాజధాని షార్నాకు వెళ్లారు. వారు ఉరుగున్ వద్ద తమ ఇంటికి తిరిగి వస్తుండగా.. ఓ సభ సమయంలో వారిని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. ఈ ముగ్గురు ఆటగాళ్లు దేశీయ క్రికెట్లో నిలకడగా ఆడుతున్నారు. జాతీయ జట్టులోకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ యువ ఆటగాళ్ల మరణంతో యావత్ క్రికెట్ ప్రపంచంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ఇది చాలా పెద్ద నష్టం.

Afghan Cricketers Killed in Pakistani Airstrikes Kabir Agha Sibghatullah and Haroon

దాడిలో మొత్తం 8 మంది మృతి
పాకిస్తాన్ వైమానిక దాడిలో మొత్తం 8 మంది మరణించారు. వీరిలో 5 మంది సామాన్య పౌరులు ఉన్నారు. అంతే కాకుండా 7గురు గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ ముగ్గురు ఆటగాళ్లను అమరులుగా ప్రకటించి వారి కుటుంబాలకు సంతాపం, సంఘీభావాన్ని తెలియజేసింది. తమ క్రికెటర్ల మరణం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(ఏసీబీ) పాకిస్తాన్‌లో జరగాల్సిన ట్రై-సిరీస్ నుంచి వైదొలిగింది. ఈ దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా గట్టి సమాధానం ఇవ్వవచ్చని భావిస్తున్నారు.

Story first published: Saturday, October 18, 2025, 10:06 [IST]
Other articles published on Oct 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+