అదే మా కొంపముంచింది.. అయినా మా ప్రయత్నం మేం చేశాం : ఆఫ్ఘన్ కెప్టెన్ నబీ వ్యాఖ్యలు

ఆసియా కప్ టోర్నీలో సూపర్ 4లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కోహ్లీ (122పరుగులు 61బంతుల్లో 12ఫోర్లు, 6సిక్సర్లు నాటౌట్) సెంచరీతో రఫ్ఫాడించగా.. కేఎల్ రాహుల్ (62పరుగులు 41బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు) సైతం చెలరేగాడు. వీరి ధాటికి తొలుత భారత్ నిర్ణీత 20ఓవర్లలో 2వికెట్లు కోల్పోయి 212పరుగులు చేసింది. ఇక 213పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ భువనేశ్వర్ కుమార్ దెబ్బకు వణికిపోయింది. భువీ 4ఓవర్లలో కేవలం 4పరుగులు మాత్రమే ఇచ్చి 1మెయిడిన్ సహా 5వికెట్లు పడగొట్టడంతో ఆఫ్ఘన్ టాపార్డర్ కుప్పకూలింది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో ఇబ్రహీం జార్డన్ (64పరుగులు 59బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) మినహా మరెవరూ రాణించలేదు. దీంతో 8వికెట్లకు 111పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలయింది. ఇక మ్యాచ్ అనంతరం కెప్టెన్ మహమ్మద్ నబీ తమ ఓటమికి గల కారణాలను పేర్కొన్నాడు.

మా వంతు ట్రై చేశాం
నబీ మాట్లాడుతూ.. 'నిన్న రాత్రి మేం పాకిస్థాన్‌తో ఆడాము. చాలా టఫ్ మ్యాచ్ జరిగింది. ఆ వెంటనే ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా భారత్‌తో తలపడ్డాం. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ రిజల్ట్ పట్ల మేం చాలా ఫీలయ్యాం. మేము భారత్‌తో మ్యాచ్‌కు మానసికంగా సిద్ధంగా లేం. మేము ఆ ఓటమిని మర్చిపోయి మేం రెడీ కావడానికి మా వంతు ప్రయత్నం చేశాం. కాని మా జట్టు ప్లేయర్లు కొందరు మానసికంగా కుంగిపోయారు. భారత్‌తో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో మేము మా బెస్ట్ ఇచ్చామనే అనుకుంటున్నా. ఇక భారత్ నుంచి కేఎల్ రాహుల్, కోహ్లీ ఓపెనింగ్ బాగుంది. అలాగే మేము కొన్ని క్యాచ్‌లను కూడా మిస్ చేశాం. బ్యాటింగ్‌లో మేము ఇంత స్వింగ్ వస్తుందని ఊహించలేదు. మేము టోర్నమెంట్‌ను ప్రారంభించిన విధానం చాలా బ్రహ్మాండంగా ఉంది. కానీ ముగింపు మాత్రం బాలేదు. ఏదేమైనా మేం బానే ఆడామనుకుంటున్నా' అని నబీ అన్నాడు.

పాకిస్థాన్ చేతిలో ఓటమితో దెబ్బతిన్న ఆఫ్ఘన్
ఇక పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ దాదాపు గెలిచినంత పనిచేసింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ 10వ నంబర్ బ్యాటర్ నషీమ్ షా రెండు సిక్సులు కొట్టడంతో ఆఫ్ఘన్ ఓటమి పాలయింది. అంతకుముందు ఫరీద్, ఆసిఫ్‌కు గొడవ కావడంతో ఈ మ్యాచ్ తీవ్ర ఉద్విగ్నంగా సాగింది. అందువల్ల ఆఫ్ఘన్ ప్లేయర్లు, అభిమానులు కూడా ఈ మ్యాచ్ ఓటమితో చాలా ఫీలయ్యారు. ఇది కొంత ఆ జట్టును దెబ్బతీసిందని చెప్పొచ్చు.

రెండో బిగ్గెస్ట్ ఓటమి..
ఇకపోతే ఆఫ్ఘనిస్థాన్‌కు టీ20ల్లో ఈ ఓటమి రెండో భారీ ఓటమి. అంతకుముందు 2012లో కొలంబోలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 116పరుగుల భారీ తేడాతో ఓటమి మూటగట్టుకుంది. ఇక రెండో భారీ ఓటమిగా ఇండియాతో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో 101పరుగుల తేడాతో ఓటమి. 2103లో ఐర్లాండ్‌తో 68పరుగుల తేడాతో, 2021లో ఇండియాతో 66పరుగుల తేడాతో ఆఫ్ఘన్ ఓటమి పాలయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications