అఫ్రిదీ రెడీ..
ఈ మ్యాచ్‌పై ఇప్పటి నుంచే హైప్ క్రియేట్ అవుతోంది. ఆసియా కప్ నుంచి టీమిండియా వైదొలగడానికి కారణమైన జట్టును రోహిత్ సేన ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఈ పరిస్థితుల మధ్య పాకిస్తాన్ బౌలింగ్ బ్యాక్‌బోన్ షహీన్ షా అఫ్రిదీ నిప్పులు చెరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గాయం వల్ల చాలాకాలం పాటు క్రికెట్‌కు దూరంగా ఉంటూ వచ్చిన ఈ స్పీడ్‌స్టర్.. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో కమ్ బ్యాక్ అయ్యాడు. తన రిథమ్ అందిపుచ్చుకున్నాడు.

ఊహించినదాని కంటే వేగంగా..
ఊహించిన దానికంటే వేగంగా కోలుకున్నాడు షహీన్ షా అఫ్రిది. ఈ విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మెడికల్ అడ్వైజరీ, క్రిస్టల్ ప్యాలెస్ ఫుట్ బాల్ క్లబ్ కృషి చాలా ఉంది. షహీన్ షా అఫ్రిది చేరికతో పాకిస్తాన్ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ మరింత బలోపేతమౌతుంది. గాయాల వల్ల టీమిండియా బౌలింగ్ బలహీనపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అవే గాయాల బారిన పడిన పాక్ బౌలర్లు కోలుకోవడం చర్చనీయాంశమౌతోంది. అఫ్రిదీకి టీమిండియా మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉండటం ఆందోళనకు గురి చేసే విషయమే.
ఆఫ్ఘనిస్తాన్‌పై..
వామప్స్‌లో భాగంగా ఆప్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో షహీన్ షా అఫ్రిది నిప్పులు చెరిగాడు. ఏ రేంజ్‌లో అతను బంతులను సంధించాడంటే.. బుల్లెట్‌లా అతను సంధించిన యార్కర్ దెబ్బకు ఆప్ఘనిస్తాన్ ఓపెనర్ రహ్మతుల్లా గుర్బాజ్.. నడవలేని స్థితికి చేరుకున్నాడు. గ్రౌండ్ నుంచి అతణ్ని వీపుపై మోసుకెళ్లాల్సి వచ్చింది. షహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే గుర్బాజ్ అవుట్ అయ్యాడు. తొలి ఓవర్ అయిదో బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

నాలుగు ఓవర్లల్లో..
మొత్తం తన నాలుగు ఓవర్ల కోటాలో అఫ్రిది 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఒక దశలో రెండు ఓవర్లల్లో నాలుగు పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడీ స్పీడ్ స్టర్. ఇది టీమిండియాకు డేంజర్ బెల్స్ మోగించినట్టే. ఈ ఆదివారం సూపర్ 12లో భాగంగా పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్రిదీని అడ్డుకునే విషయంలో రోహిత్ సేన.. అప్రమత్తం కావాల్సి ఉంటుందనడంలో సందేహాలు అక్కర్లేదు.


Click it and Unblock the Notifications
