Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రషీద్‌ ఖాన్ ఆల్‌టైమ్ రికార్డు..క్రికెట్ చరిత్రలో తొలిసారి!

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అఫ్గానిస్థాన్ మరో అద్భుత విజయం సాధించింది. వరల్డ్ నంబర్ 3 ర్యాంకర్ దక్షిణాఫ్రికాను 177 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. షార్జా వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆల్‌రౌండ్ షోతో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. సౌతాఫ్రికాపై తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌ను గెలిచింది. అంతేగాక పరుగుల పరంగా వన్డేల్లో అఫ్గాన్‌కు ఇదే భారీ విజయం. మరోవైపు సఫారీ సేనకు అయిదో అతి పెద్ద ఓటమి.

మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 311 పరుగులు చేసింది. గుర్బాజ్ (105; 110 బంతుల్లో, 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో చెలరేగాడు. అజ్మతుల్లా (86; 50 బంతుల్లో, 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. రహ్మత్ (50; 66 బంతుల్లో, 2 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఎంగిడి, బర్గర్, పీటర్, మార్క్‌రమ్ తలో వికెట్ తీశారు.

AFG vs SA Rashid Khan Sets Record as First Player to Take Five-Wicket Haul on Birthday in ODI

అనంతరం 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 34.2 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ బవుమా (38; 47 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. టోని డిజోర్జి (31; 44 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), మార్క్‌రమ్ (21; 30 బంతుల్లో, 1 ఫోర్), రీజా హెండ్రిక్స్ (17; 34 బంతుల్లో, 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు. బర్త్‌డే బాయ్ రషీద్ ఖాన్ (5/19) అయిదు వికెట్లు, ఖరోటె (4/26) నాలుగు వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు.

అయితే ఈ క్రమంలో రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే చరిత్రలో తమ పుట్టినరోజున అయిదు వికెట్లు పడగొట్టిన తొలి ప్లేయర్‌గా, అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా రషీద్ ఖాన్ చరిత్రకెక్కాడు. బర్త్‌డే రోజు అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్ల జాబితాలో రషీద్ ఖాన్ తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా ప్లేయర్ వెర్నాన్ ఫిలాండర్, ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఉన్నారు. 2007లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిలాండర్ నాలుగు (4/12) వికెట్లు తీశాడు. 2010లో ఆస్ట్రేలియాపై బ్రాడ్ (4/44) నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Story first published: Saturday, September 21, 2024, 10:11 [IST]
Other articles published on Sep 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+