Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs AFG: వరల్డ్ కప్ చరిత్రలోనే అఫ్గానిస్థాన్ చెత్త రికార్డు!

ట్రిండాడ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సెమీఫైనల్‌‌లో అఫ్గానిస్థాన్ కోరుకోని రికార్డులు నెలకొల్పింది. వరల్డ్ కప్ చరిత్రలోనే సెమీస్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా అపకీర్తి మూటగట్టుకుంది. దీంతో పాటు అఫ్గాన్ పలు ఆశించని రికార్డులు నమోదుచేసింది. మందకొడి పిచ్‌పై దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి అఫ్గానిస్థాన్ బ్యాటర్లు వణికిపోయారు.

అఫ్గానిస్థాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. అఫ్గానిస్థాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (10; 12 బంతుల్లో, 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నాడు. మిగిలిన ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరారు. ముగ్గురు బ్యాటర్లు డకౌటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జేన్సన్ (3/16), షంసీ (3/6) చెరో మూడు వికెట్లతో విజృంభించారు. రబాడ (2/14), నోకియా (2/7) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు.

AFG vs SA Afghanistan Records Lowest Total in T20 World Cup Semi-Final History

అయితే ఈ క్రమంలో పలు కోరుకోని రికార్డులు అఫ్గానిస్థాన్ నమోదు చేసింది. వరల్డ్ కప్ సెమీస్‌లో అత్యల్ప స్కోరుతో పాటు టీ20 నాకౌట్స్‌లోనే ఇదే తక్కువ స్కోరు. అంతకముందు నాకౌట్స్‌లో అత్యల్ప స్కోరు రికార్డు బోట్స్వానా పేరిట ఉండేది. ఆఫ్రికా క్రికెట్ అసోషియేషన్ కప్ సెమీస్‌లో ఉగాండతో జరిగిన మ్యాచ్‌లో బోట్స్వానా 62 పరుగులకు ఆలౌటైంది. ఇప్పుడు ఈ రికార్డును అఫ్గానిస్థాన్ బ్రేక్ చేసింది.

ఇక టీ20 క్రికెట్‌లో అఫ్గానిస్థాన్‌కు ఇదే అత్యల్ప స్కోరు. అంతకుముందు బంగ్లాదేశ్‌పై చేసిన 72 పరుగులే అఫ్గాన్‌కు అత్యల్పంగా ఉండేది. మరోవైపు తమ ప్రత్యర్థిని అత్యంత తక్కువ స్కోరుకు కట్టడి చేసిన రికార్డును సౌతాఫ్రికా సాధించింది. గతంలో శ్రీలంకను దక్షిణాఫ్రికా 77 పరుగులకు ఆలౌట్ చేయగా, ఆ రికార్డును ఇవాళ సెమీఫైనల్‌లో బద్దలు కొట్టింది.

టీ20 వరల్డ్ కప్‌ చరిత్రలో ఫుల్ మెంబర్ టీమ్స్‌లో అఫ్గాన్ సాధించిన 56 పరుగుల స్కోరు రెండో అత్యల్పం. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఇంగ్లండ్ ఉంది. 2021లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 56 పరుగులకే ఆలౌటైంది. మూడో స్థానంలో న్యూజిలాండ్ (60, శ్రీలంకపై-2014), నాలుగో స్థానంలో బంగ్లాదేశ్ (70, న్యూజిలాండ్‌పై-2016) ఉన్నాయి.

Story first published: Thursday, June 27, 2024, 8:03 [IST]
Other articles published on Jun 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+