Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asif Ali: ఊహించని విజయం.. అచ్చం ఎంఎస్ ధోనీలానే సెల‌బ్రేట్ చేసుకున్న పాకిస్థాన్ బ్యాట‌ర్!!

AFG vs PAK: Asif Ali Celebrates MS Dhonis Gun Shot vs Afghanistan in T20 World Cup 2021
T20 World Cup : బ్యాట్‌ను గ‌న్ ట్రిగ్గ‌ర్ నొక్కిన‌ట్లు.. Dhoni తరహాలో సెలెబ్రేషన్స్| Oneindia Telugu

హైదరాబాద్: ఏమాత్రం అంచనాలు లేకుండా టీ20 ప్రపంచకప్‌ 2021లో అడుగుపెట్టిన పాకిస్థాన్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్న . విషయం తెలిసిందే. సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచులో పాకిస్థాన్‌ 5 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. పాక్‌ విజయానికి 12 బంతుల్లో 24 పరుగులు అవసరమైన దశలో 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' ఆసిఫ్‌ అలీ (7 బంతుల్లో 25 నాటౌట్‌; 4 సిక్సర్లు) నాలుగు సిక్సర్లు కొట్టి జట్టును విజయతీరాలకు చేర్చాడు. సూపర్ 12లో ఆడిన మూడు మ్యాచ్‌లు గెలుపొందిన పాక్ సెమీస్‌కు మరింత చేరువైంది. మిగిలిన మ్యాచ్‌ల్లో స్కాట్లాండ్‌, నమీబియా లాంటి చిన్న జట్లతో తలపడాల్సి ఉన్న నేపథ్యంలో పాక్‌ జట్టు సెమీస్‌ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాట‌ర్ ఆసిఫ్‌ అలీ తన ప‌వ‌ర్ షాట్ల‌తో మైదానంలో అభిమానులను అలరించాడు. 19వ ఓవ‌ర్‌లో నాలుగు సిక్స‌ర్లు కొట్టి.. అనూహ్య రీతిలో పాకిస్థాన్‌కు అద్భుత విజ‌యాన్ని అందించాడు. అయితే సూర్ విక్ట‌రీ త‌ర్వాత అసిఫ్ అలీ.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తరహాలో సెల‌బ్రేట్ చేసుకున్నాడు. గ‌తంలో ధోనీ ఎప్పుడు విన్నింగ్ షాట్ కొట్టినా.. గ‌న్ షాట్ సెలబ్రేట్ చేసుకునేవాడు. విన్నింగ్స్ షాట్ కొట్టిన త‌ర్వాత‌.. బ్యాట్‌ను గ‌న్ ట్రిగ్గ‌ర్ నొక్కిన‌ట్లు ఫోజు ఇస్తూ మహీ ఎంజాయ్ చేసేవాడు. ఓట‌మి త‌ప్ప‌దేమో అనుకున్న స‌మ‌యంలో.. భారీ సిక్స‌ర్ల‌తో అల‌రించిన అలీ కూడా ధోనీ త‌ర‌హాలోనే ఆ చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నాడు.

నాలుగు భారీ సిక్స‌ర్లు కొట్టిన త‌ర్వాత ఆసిఫ్‌ అలీ త‌న బ్యాట్‌తో గ‌న్‌షాట్ ఫోజు ఇచ్చి సంబ‌రాల్లో తేలిపోయాడు. దాంతో మైదానంలోని పాక్ ఫాన్స్ తెగసంబరపడిపోయారు. అలీ గ‌న్‌షాట్ ఫోజుకు సంబందించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలీ సెలెబ్రేషన్స్‌పై ట్విట్ట‌ర్‌లో క్రికెట్ అభిమానులు కామెంట్లు కురిపిస్తున్నారు. ఎంఎస్ ధోనీని అలీ అనుక‌రించిన‌ట్లు కొంద‌రు ట్వీట్లు చేశారు. అచ్చం ఎంఎస్ ధోనీలానే సెల‌బ్రేట్ చేసుకున్నాడుగా అంటూ ఇంకొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఆసిఫ్‌ అలీ పాక్ తరఫున 20 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. వన్డేల్లో 382, టీ20ల్లో 396 పరుగులు చేశాడు.

2005లో జైపూర్‌లో శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ తొలిసారి గ‌న్‌షాట్ ఫోజు ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో 183 పరుగులు చేసిన మహీ ఆ మూమెంట్‌ను సెల‌బ్రేట్ చేసుకున్నాడు. ఆ త‌ర్వాత కూడా ప‌లుమార్లు మహీ విన్నింగ్ షాట్ ఆడిన త‌ర్వాత గ‌న్‌షాట్ మూమెంట్‌ను సెల‌బ్రేట్ చేసుకున్నాడు. 16 ఏళ్ల క్రితం ధోనీ ఇచ్చిన స్టంట్ త‌ర‌హాలోనే ఆసిఫ్‌ అలీ ఇప్పుడు సెల‌బ్రేట్ చేసుకున్నాడు. ఆఫ్ఘ‌న్‌తో మ్యాచ్‌లో అలీ కేవ‌లం 7 బంతుల్లో 25 ర‌న్స్ చేశాడు. క‌రీమ్ జాన‌త్ వేసిన 19వ ఓవ‌ర్‌లో 4 సిక్స‌ర్లు కొట్టాడు. 12 బంతుల్లో 24 ర‌న్స్ అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో అలీ సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్‌ మ్యాచ్‌లోనూ అలీ రెండు సిక్సులు బాదాడు. రెండు మ్యాచుల్లో ఆసిఫ్‌ ఏడు సిక్స‌ర్ల‌ను కొట్టడం విశేషం.

Story first published: Saturday, October 30, 2021, 12:07 [IST]
Other articles published on Oct 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+