For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AFG vs BAN: వాళ్ల వల్లే సెమీస్‌కు చేరాం.. థ్యాంక్స్ లారా!- రషీద్ ఖాన్

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌‌ అయిన అఫ్గానిస్థాన్ టీ20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి బంగ్లాదేశ్‌ను ఓడించింది. వర్షం కారణంగా బంగ్లా ఛేదనను 19 ఓవర్లకు కుదించిన ఈ పోరులో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదట అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 115 పరుగులు చేసింది. గుర్బాజ్ (43; 55 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రిషద్ హొస్సేన్ (3/26) మూడు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. రషీద్ ఖాన్ (4/23), నవీనుల్ హక్ (4/26) చెరో నాలుగు వికెట్లతో విజృంభించారు. లిటన్ దాస్ (54 నాటౌట్; 49 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడాడు.

AFG vs BAN Rashid Khan Overwhelmed I m Speechless After Afghanistan Qualifies for Semifinals

కాగా, మ్యాచ్ అనంతరం అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ మాట్లాడాడు. సెమీఫైనల్స్‌కు చేరిన ఆనందాన్ని తన మాటల్లో వర్ణించలేకపోతున్నాని అన్నాడు. ఆత్మవిశ్వాసంతోనే సత్తాచాటి న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై విజయం సాధించమని అన్నాడు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారాకు రషీద్ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాడు. తమ జట్టును లారా ఒక్కరే ఈ టోర్నీలో నమ్మారని, సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తామని విశ్వసించారని రషీద్ చెప్పాడు. లారా మాటను నిలబెట్టేలా పోరాడాలని మ్యాచ్‌కు ముందే నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

ఇక జట్టు సమష్టి ప్రదర్శనతో సెమీఫైనల్స్‌కు చేరామని రషీద్ అన్నాడు.సెమీఫైనల్స్ చేరాలంటే బంగ్లాదేశ్ 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించాలి. అయితే ఈ క్రమంలో దూకుడుగా ఆడే ప్రయత్నంలో బంగ్లాదేశ్ తప్పులు చేస్తుందని గ్రహించి, ముందుగానే ప్రణాళికలు రచించుకున్నామని అఫ్గాన్ కెప్టెన్ రషీద్ చెప్పాడు. స్టంప్ టూ స్టంప్ బౌలింగ్ చేసి వికెట్లు తీయాలని ప్లాన్ చేశామని, అది ఫలించిందని తెలిపాడు. అయితే ఈ పిచ్‌పై సగటు స్కోరకు 15-20 పరుగులు తక్కువగా చేశామని రషీద్ అంగీకరించాడు.

సెమీస్ చేరాలంటే 20 ఓవర్లలో బంగ్లాదేశ్ పది వికెట్లు సాధించాలనే సంకల్పంతోనే బరిలోకి దిగామని తెలిపాడు. వర్షం, మ్యాచ్ రద్దు గురించి ఆలోచించలేదని వివరించాడు. తొడకండరాలు పట్టేశాయని సాకుతో గుల్బాదిన్ నైబ్ మ్యాచ్‌ను ఆలస్యం చేయడంపై రషీద్ ఖాన్ స్పందించాడు. ప్రస్తుతం నైబ్ బాగానే ఉన్నాడని నవ్వుతూ తెలిపాడు. మ్యాచ్‌ ఆలస్యం చేస్తే డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో అఫ్గానిస్థాన్‌కు కలిసొస్తుందని నైబ్ యాక్టింగ్ చేస్తూ మైదానంలో పడిపోయాడు. ఆ తర్వాత నైబ్ కాసేపటికే రెండు ఓవర్లు బౌలింగ్ చేయడం గమనార్హం.

Story first published: Tuesday, June 25, 2024, 12:24 [IST]
Other articles published on Jun 25, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+