Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AFG vs BAN: కోపంతో నాన్ స్ట్రైకర్‌పై బ్యాటు విసిరిన రషీద్ ఖాన్ (Video)

టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ (19 నాటౌట్; 10 బంతుల్లో, 3 సిక్సర్లు) తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎలాగైనా సెమీఫైనల్‌కు అర్హత సాధించాలనే కసితో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. అయితే తన సహచర ఆటగాళ్ల నుంచి మద్దతు దక్కకపోవడంతో రషీద్ కోపంతో ఊగిపోయాడు. నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న తన రన్నింగ్ పార్టనర్ కరీమ్ జనత్‌ (7 నాటౌట్; 6 బంతుల్లో, 1 ఫోర్)పై ఆవేశంగా బ్యాటు విసిరాడు.

కరీమ్ జనత్‌ను రషీద్ ఖాన్ కొట్టేస్తాడేమో అనేలా ఉద్రిక్త వాతావరణం ఏర్పడిండి. కరీమ్ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా రషీద్ వినలేదు. అసలేం జరిగిదంటే.. అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 115 పరుగులు చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (43; 55 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. అయితే ఓ దశలో అఫ్గాన్ 10 ఓవర్లకు 58/0 స్కోరుతో నిలిచింది. దీంతో అఫ్గాన్ సునాయాసంగా 140 పరుగులు సాధిస్తుందని భావించారంతా.

AFG vs BAN Rashid Khan s Frustration Boils Over as He Hurls Bat at Partner Over Missed Second Run

కానీ 19 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 100/5 మాత్రమే. అఫ్గాన్ బ్యాటర్లు క్రమంగా వికెట్లు కోల్పోవడమే కాకుండా స్లో ఇన్నింగ్స్ ఆడారు. సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్థాన్ తప్పక విజయం సాధించాలి. కానీ అఫ్గాన్ బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడకుండా స్వల్ప స్కోరుతో సరిపెట్టేలా పరిస్థితి తీసుకువచ్చారు. ఈ స్థితిలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ ఆఖరి ఓవర్‌లో వీలైనంత ఎక్కువ పరుగులు సాధించాలనే తపనతో బ్యాటింగ్ కొనసాగించాడు.

తన్జీమ్ హసన్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతికి కరన్ జనత్ సింగిల్ తీయడంతో స్ట్రైకింగ్ అందుకున్న రషీద్ రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. తర్వాతి బంతిని కూడా రషీద్ భారీ షాట్‌కు యత్నించాడు. కానీ బ్యాటుకు సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. బంగ్లాదేశ్ ఫీల్డర్లు దాన్ని క్యాచ్‌గా అందుకోలేకపోయారు. మరోవైపు రషీద్ దానికి రెండు పరుగులు తీయాలని భావించాడు. రెండో పరుగును సగం దూరం పూర్తిచేశాడు. కానీ మరో ఎండ్‌లో ఉన్న కరీమ్ జనత్ డబుల్స్‌కు నిరాకరించాడు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో కరీమ్ ఇలా చేయడంతో రషీద్‌కు పట్టరాని కోపం వచ్చింది.

బ్యాటును కరీమ్ జనత్‌వైపు నేలకేసి కొట్టి ఫ్రస్టేషన్‌తో వెనక్కి వచ్చాడు. అనంతరం కరీమ్ జనత్‌వైపు ఆవేశంగా చూశాడు. బ్యాటును తీసుకువచ్చిన కరీమ్.. రషీద్‌కు వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ రషీద్ అసంతృప్తితో నాన్‌స్ట్రైకింగ్‌లోకి వెళ్లిపోయాడు. అయితే ఆ తర్వాత కరీమ్ వెంటనే సింగిల్ తీసి రషీద్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఆఖరి బంతిని రషీద్ ఖాన్ సిక్సర్ బాది జట్టుకు విలువైన పరుగులు అందించాడు.

Story first published: Tuesday, June 25, 2024, 9:53 [IST]
Other articles published on Jun 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+