మూడు వన్డేల సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సత్తాచాటింది. షార్జా వేదికగా జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్థాన్‌ను 68 పరుగుల తేడాతో ఓడించింది. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి సిరీస్‌లో 1-1తో అఫ్గాన్ ఆధిక్యాన్ని సమం చేసింది. మొదట బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 252 పరుగులు చేసింది.
కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (76; 119 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకంతో రాణించాడు. జేకర్ అలీ (37; 27 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు), సౌమ్య సర్కార్ (35; 49 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పరుగులు చేశారు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ఖరోటె మూడు వికెట్లు, గజనఫర్, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో అఫ్గానిస్థాన్ 43.3 ఓవర్లలో 184 పరుగులకే ఆలౌటైంది. రహమత్ షా (52; 76 బంతుల్లో, 5 ఫోర్లు), సెదీఖుల్లా అటల్ (39; 51 బంతుల్లో, 5 ఫోర్లు) టాప్ స్కోరర్లు. బంగ్లా బౌలర్లలో నసుమ్ అహ్మద్ మూడు వికెట్లు, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మెహదీ హసన్ మీర్జా చెరో రెండు వికెట్లు పడగొట్టాడరు. అయితే రహమత్ షా ఔటైన రనౌట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
30వ ఓవర్‌లో నాసుమ్ అహ్మద్ వేసిన ఆఖరి బంతిని గుల్బాదిన్ నైబ్ కవర్ మీదుగా షాట్‌కు యత్నించాడు. నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న రహమత్‌ను సింగిల్‌కు పిలిచాడు. అయితే రిషద్ హొస్సేన్ బంతిని అడ్డుకొని వికెట్ కీపర్‌కు త్రో విసిరాడు. మరోవైపు గుల్బాదిన్ సింగిల్‌ను వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకుని, తిరిగి క్రీజులోకి పరిగెత్తాడు. రహమత్ కూడా వికెట్ కీపర్ వైపుగా పరిగెత్తాడు.
తామే ముందు క్రీజులోకి చేరుకోవాలని రహమత్, గుల్బాదిన్ రన్నింగ్ రేసును తలపించేలా పరిగెత్తారు. గుల్బాదిన్ డైవ్ చేస్తూ రహమత్ కంటే ముందు క్రీజులోకి వెళ్లిపోయాడు. మరోవైపు ఫీల్డర్ నుంచి త్రో అందుకున్న వికెట్ కీపర్ బౌలర్‌కు బంతిని అందించాడు. నాన్‌స్ట్రైకర్ వైపు బెయిల్స్‌ను బౌలర్ పడగొట్టాడు. ఈ క్రమంలో కుదురుకున్న రహమత్ షా పెవిలియన్‌కు చేరాడు.
Madness in the middle! 😵💫
— FanCode (@FanCode) November 9, 2024
The Bangla Tigers pounce on a terrible mix-up between Rahmat and Gulbadin. 🫣#AFGvBANonFanCode pic.twitter.com/NftL7xRBdo