కోల్‌కత్తా: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, సాక్షిల ముద్దుల కూతురు జివాకు సంబంధించిన ఫోటో ఒకటి ట్విట్టర్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోని ధోని భార్య సాక్షి మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఈ ఫోటోలో ధోని లేకున్నా చిన్నారి జివా మాత్రం తెలుపు డ్రస్సులో ఎంతో అందంగా ఉంది. కోల్‌కత్తాలో దుర్గా పూజలో పాల్గొన్న ధోని భార్య సాక్షి చిన్నారి జివాను ఎత్తుకుని ఉంది. జివాకు ఆ దుర్గామాత మరింత శక్తిని ఇవ్వాలంటూ ట్వీట్ చేశారు.
ఇక టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరిస్‌లో బిజీగా ఉన్నారు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా చివరి వన్డే అక్టోబర్ 25(ఆదివారం)నాడు ముంబైలో జరగనుంది. ఐదు వన్డేల సిరిస్‌లో భారత్, దక్షిణాఫ్రికా 2-2తో సమానంగా ఉన్నాయి.
టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ఆస్టేలియాలో వరల్డ్ కప్‌లో బిజీగా ఉన్నప్పుడు ఫిబ్రవరి 6, 2015న జివా పుట్టింది. వరల్డ్ కప్ అనంతరం భారత్‌కు చేరుకున్న కెప్టెన్ ధోని తన ముద్దుల కూతురుకి సంబంధించిన చాలా ఫోటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.