Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీసేనతో తొలి టెస్టులో తలపడే ఇంగ్లాండ్ జట్టు ఇదే

Adil Rashid Returns As England Name 13-Man Squad For 1st Test Against India

హైదరాబాద్: టీమిండియాతో ఆగస్టు 1 నుంచి ఆరంభమయ్యే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు ఇంగ్లాండ్ జట్టుని బోర్డు గురువారం ప్రకటించింది. మొత్తం13 మందితో కూడిన జట్టుని జాతీయ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ బోర్డు కేవలం తొలి టెస్టుకు మాత్రమే జట్టును ఎంపిక చేసింది.

ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషిద్ సుదీర్ఘ విరామం తరువాత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడు చివరిసారిగా 2016 డిసెంబర్‌లో చెన్నైలో భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ జట్టు తరుపున ఆడాడు. మరోవైపు దేశవాళీ టోర్నీలో రాణిస్తున్న ఎసెక్స్ పేసర్ జామీ పోర్టర్‌ను సెలక్టర్లు తొలిసారి టెస్టు జట్టులో చోటు కల్పించారు.

25 ఏళ్ల పోర్టర్ 2017 సంవత్సరానికి గాను కౌంటీ ఛాంపియన్‌షిప్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అందుకున్నాడు. ఆల్‌రౌండర్ మొయిన్ అలీ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. న్యూజిలాండ్ పర్యటన తరువాత టెస్టు జట్టులో అతడు చోటు దక్కడం అతనికి ఇదే తొలిసారి.

1
42374

మరోవైపు ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ క్రిస్‌వోక్స్ గాయం నుంచి కోలుకొని ఫిట్‌నెస్ సాధించేందుకు మరింత సమయం పడుతుందని సెలక్షన్ కమిటీ వెల్లడించింది.

ఇంగ్లాండ్ టెస్టు జట్టు:
జో రూట్(కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో(వికెట్ కీపర్), స్టువర్ట్ బ్రాడ్, జోస్ బట్లర్, అలిస్టర్ కుక్, సామ్ కర్రన్, కీటన్ జెన్నింగ్స్, డేవిడ్ మలాన్, జామీ పోర్టర్, అదిల్ రషీద్, బెన్‌స్టోక్స్

Story first published: Thursday, July 26, 2018, 18:04 [IST]
Other articles published on Jul 26, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+