For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచ రికార్డు: చేసింది 596 పరుగులు... గెలిచింది 571 పరుగులతో

Adelaide Womens Team Amasses 596 Runs in 50-Over Match, Wins by 571 Runs

హైదరాబాద్: ఆస్ట్రేలియాలో జరిగిన సబర్బన్‌ మహిళల క్రికెట్‌లో నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఎస్‌ఏసీఏ పీసీ స్టేట్‌వైడ్‌ సూపర్‌ ఉమెన్స్‌ ఫస్ట్‌ గ్రేడ్‌ మ్యాచ్‌లో భాగంగా జరిగిన ఈ వన్డేలో నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్లకు ఏకంగా 596 పరుగులు సాధించింది.

నలుగురు బ్యాట్స్‌వుమెన్‌ సెంచరీలు

నలుగురు బ్యాట్స్‌వుమెన్‌ సెంచరీలు

ఈ మ్యాచ్‌లో నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ జట్టు కెప్టెన్ టీగన్ మెక్ఫార్లిన్‌తో పాటు శామ్ బెట్స్, తబితా సావెల్లి, డార్సీ బ్రౌన్ ఇలా నలుగురు బ్యాట్స్‌వుమెన్‌ సెంచరీలు నమోదు చేశారు. మెక్ఫార్లిన్‌ 80 బంతుల్లో 136 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. బెట్స్ (71 బంతుల్లో 124 నాటౌట్), తబితా సావెల్లి (56 బంతుల్లో 120), బ్రౌన్(84 బంతుల్లో 117) పరుగులు చేశారు.

88 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో

88 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో

దీంతో పాటు ఆ జట్టుకు 88 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలోనే వచ్చాయి. దీంతో నార్తర్న్‌ డిస్ట్రిక్ట్స్‌ జట్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 64 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రత్యర్థి పోర్ట్‌ ఆడిలైడ్‌ 10.5 ఓవర్లలో కేవలం 25 పరుగులకే కుప్పకూలింది. దీంతో 571 పరుగుల భారీ తేడాతో నార్తర్న్‌ జట్టు విజయం సాధించింది.

ప్రపంచ రికార్డు కావచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం

ప్రపంచ రికార్డు కావచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం

డిస్ట్రిక్ట్‌ లెవెల్‌ గేమ్‌లో స్కోర్లు అధికారికంగా నమోదు కాకపోయినా ఇది ప్రపంచ రికార్డు కావచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో లిస్ట్‌-ఎ క్రికెట్‌లో శ్రీలంకకు చెందిన కండ్యన్‌ లేడీస్‌ 50 ఓవర్లలో 632 పరుగులు చేసి రికార్డులకెక్కింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అత్యధిక స్కోరు న్యూజిలాండ్‌ మహిళల జట్టు (490/4) పేరిట ఉంది.

Story first published: Tuesday, October 16, 2018, 11:26 [IST]
Other articles published on Oct 16, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+